సినీ సాహిత్యంలో సవ్యసాచి వేటూరి
02010 మే 22 న రాత్రి ఎనిమిది గంటల సమయంలో తెలుగు సినీ గీతాల ఆచంద్రతారార్క కీర్తి, శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి వాగ్దేవి పంపిన అంబారీ మీద, ద్వివిజ కవివరుల గుండెలు దిగ్గురనగా అరిగినాడు అమరపురికి. ఆయనలేని లోటు తెలుగు సినీ గీత సాహిత్యానికి ఎవరూ పూడ్చలేనిది. ఆయన కలం సినీ సాహిత్యంలో సవ్యసాచిలా కదం తొక్కింది. తెలుగువన్ డాట్ కాం ఆయన ఆత్మశాంతిని కోరుతూ, చంద్రునికో నూలుపోగులా సమర్పిస్తున్న చిన్న వ్యాసం. ఆయన గురించిన వివరాలలోకి వెళితే …. (more…)
పద ఝరి వేటూరి (బి.రాజేశ్వర ప్రసాద్-ఆంధ్రభూమి)
0తెలుగుపాటను కొత్త పుంతలు తొక్కించిన కలం ఆయనది. తెలుగు మాటను మురిపించి, మైమరిపించిన పద ఝరి వేటూరి. ఆయన లేని లోటు తెలుగు మాటకు, పాటకు, భాషకే తీరనిది. ఆయన కలం బలం అంతటిది. ఆయన భావజాలం అంత గొప్పది. ఆ కలానికి అడ్డులేదు. భాషాపరమైన అవరోధాలూ లేవు. అందుకే ఎలదేటి పాటలా సాఫీగా మూడున్నర దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా సాగిందా సిరా. ఆయన పాటలో తత్వం పలుకుకుంది. అరమరికల్లేని ఆనందం పరవశిస్తుంది. శృంగారం పరవళ్లు తొక్కుతుంది. విరహమూ వీరంగం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వేటూరి కలం పడితే కలకలమే. భావ ప్రవాహమే. ఎలాంటి భావ లోతులకైనా ఆయన కలం వెళ్లగలుగుతుంది. (more…)
అసుర సంధ్య వేళ ..వేటూరి పాట (వనజ వనమాలి)
0అమరజీవి చిత్రం ..గుర్తుందా? ఆ చిత్రంలో..ఓ..వింత ప్రేమ కథ. ఆసాంతం అపార్ధాలతో..నడచి..ఆఖరికి ప్రేమించిన ప్రేయసి భర్తకి.. తన కళ్ళని దానం చేసి అమరజీవిగా నిలిచిన..ఓ..ప్రియుని కథ. చిత్రం కన్నా పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామీ “అనే పాట..నాకు బాగా నచ్చుతుంది. వేటూరి గారి .. సాహిత్యం ..చాలా ఇష్టంగా వింటాను.
ఈ పాట తరచూ కోరి మిగతా శ్రోతల వినబడని తిట్లు తింటూ ఉంటాను. ఎందుకంటే ఆరు నిమిషాల పైబడి ఉన్న పాటని ఆస్వాదించడం తెలియకుంటే..పరమ చిరాకు కల్గిస్తుంది. అర్ధమైన వారికి..ఒక రసస్వాదన.శ్రీవారికి ప్రేమలేఖ కన్నా ముందు వేటూరి గారి పద రచన .. ఓ..ప్రేమ లేఖ రూపంలో..ఈ పాట ముందు సాకీగా సాగుతుంది.
ఈ పాట ఒక వేదిక పై సాగుతూ..నాయికా నాయకుల ఊహా లోకంలో సాగుతున్నట్లు గుర్తు…ఉంది. ఒక వేళ ఏమైనా మార్పు ఉంటే.. తప్పని తప్పు సమాచారంకి..మన్నించ గలరు. . ఇక్కడ పాట నేపధ్యం కన్నా పాట సాహిత్యం,సంగీతం,భావం చెప్పదలచాను. ఈ పాట సాహిత్యం కూడా.. చాలా కష్టపడ్డా సేకరించలేక.. వింటూ..వ్రాసుకున్నాను. ఇది అంతా పాట పై మమకారమే! అదీ.. వేటూరి పాట పై..ప్రత్యెక మమకారం. (more…)
ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు (వంశీ)
3ఆమె తన బెంగని సంపెంగపూలలో దాచుకుందట
ఆమె నోము సన్నజాజి పూలతో నోచిందంట.
రాసుకుంటూ పోవాలిగాని ఇలాంటి ఎక్స్ప్రెషన్లు కోకొల్లలు.
నీవు వారణ నేను అసి
వలసి వచ్చిన ప్రేయసి
అనురాగం మన మతము, ఇది అసిధారావ్రతము, స్వర్గాదపీ గరీయసి, ప్రేమే కదా వారణాసి.. ఇలాంటి పాటలు ఎన్నెన్నని.
ఆయన కాయిన్ చేసిన పదాలెన్నని. (more…)
పాపం వేటూరి! (మోహన్ రాజ్)
0
వేటూరి..నా ఆల్-టైం ఫేవరెట్ గీతరచయిత.
చిన్నపుడెపుడో సీతాకోక చిలుక పాటలు వింటుంటే..
హే చుక్కా నవ్వవే
నావకు చుక్కానవ్వవే..
……
చుక్కా నవ్వవే
వేగుల చుక్కానవ్వవే..
లాంటి పదకేళులు చూస్తే అబ్బురమనిపించేది!!! (more…)
పాటకు చందస్సు మారిపోయింది, మాటకు విలువ పడిపోయింది.
0
సినీ ఫార్ములాలు ఏర్పడ్డ తర్వాత జీవత్ చిత్రాల జోలికి వెళ్ళడం మానేసారు దర్శక నిర్మాతలు. వినోదం ఒక్కటే సినిమాకి పరమావధి చేసుకున్నారు.జనాకర్షణా తద్వారా ధనార్జనా ప్రధానమైన తర్వాత పాటకు చందస్సు మారిపోయింది, మాటకు విలువ పడిపోయింది. ఆర్ధోక్తిలో, చిరునవ్వులో, నిట్టూర్పులో, కన్నీటిచుక్కలో మౌనమైన మాటకి శక్తి పోయింది. అటువంటి సినిమాలు (దేవత, త్యాగయ్య, సీతాకోకచిలుక, గీతాంజలి, శంకరాభరణం) తియ్యాలనే ఆసక్తి నిర్మాతల్లో తగ్గిపోయింది.
సినిమా సాహితీ సరస్వతికి రెండు కళ్ళు
2ఓం నమశివాయ ఓం నమశివాయ
చంద్ర కళాధర సహృదయా…చంద్ర కళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయలయనిలయా.
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాహారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి
ఋత్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా (more…)
సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక (వేటూరి)
0సిరిమువ్వలు
ఆకాశవాణి పత్రిక ‘వాణి’లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ప్రకటన చూసి 1969లో ఒకనాడు రేడియోస్టేషనుకు వెళ్ళి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారిని కలిశాను. “ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా! మంచి సంగీతనాటిక రాసి ఇవ్వు ప్రచారం చేద్దాం” అన్నారాయన.
ఆడియో వినుటకు ప్లే నొక్కండి
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు.
నిడివి: ౬౫ (65) ని.
ఎన్నాళ్ళనుంచో ఈ ‘సిరికాకొలను చిన్నది’ అంతరంగ స్థలం మీద అప్పటికే గజ్జె కట్టి ఆడుతూ వుండేది. కూనిరాగాలు తీస్తూ ఉండేది. శ్రావణిగా, సుధాలాపసుందరిగా వినిపించేది. నర్తనబాలగా, ముకుందమాలగా కదిలేదీ కదిలించేది. మురిపిస్తూనే ముముక్షువును చేసేది. రజనీకాంతరావుగారి మాటతో, మా తండ్రిగారి (డాక్టర్ వేటూరి చంద్రశేఖరశాస్త్రి గారు) ఆజ్ఞతో వెంటనే మద్రాసు వెళ్ళి రాత్రింబవళ్ళు రాసి ఈ అందాలరాశిని నేను తొలిసారిగా అక్షరాలా చూసుకున్నాను. పద్యాలు, పదాలు, పాటలు, గద్యాలు, పలు విన్యాసాలు! రేడియో నాటిక గదా అని చాలా కుదించాను. (more…)
అలంకారాల ‘కలం’ కారి వేటూరి
0తెలుగు సినీ సంగీతాన్ని నవ్యపథంలో, దివ్యపథంలో, భవ్యపథంలో నడిపించిన ఆకుపచ్చ సిరాసిరి శ్రీ వేటూరి. విలక్షణ పద రచనల బాణీలకు చిలకపచ్చ ఓణీలను వేసిన నవ్యపథ సంచారి. పలుకుందల్లిని అక్షర చాంపేయకుసుమ మాలలతో అర్చించిన ‘యశశ్శౌరి’. వేలాది పాటలను అలవోకగా వెలయించి, అలసి సొలసిన ‘పాటసారి’ శ్రీ వేటూరి. తెలుగు సినీవనంలో అంకురించిన వేటూరి సుందరరామమూర్తి పాట, ‘సీతాలు సింగారం… మాలచ్చీ బంగారం’ అంటూ శృంగారవీధిలో చివురించింది. ”కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ.. కొమ్మకొమ్మకో సన్నాయీ..” అంటూ రుతువులలో మొగ్గ తొడిగింది. ”మల్లికా.. నవ మల్లికా, బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే..” అంటూ పాటల పూదోటలో, ఎన్నెన్నో పూలను గుబాళింపజేసింది. ”శివశివ శంకరా భక్తవశంకరా…” అన్నా, ”శంకరా, నాద శరీరా పరా..” అన్నా, శంకరాద్వైతాన్ని, ”అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము” అంటూ హరితత్వాన్ని ప్రబోధించినా, ”మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ..” అని మానవత్వ ఔన్నత్యాన్ని చైతన్యవంతం చేసినా, వేటూరి పలుకు పలుకూ ఓ మంత్రాక్షరి, రసఝరి. వేటూరి సాహిత్యంలో ఒకసారి తేనెల సోనలు కురిస్తే, ఒకచోట పంచమ స్వరాలు వినిపిస్తాయి. ఇంకోచోట ప్రాజ్ఞండల విద్యుల్లతా ధ్వానాలు ప్రకటిస్తాయి. ”తకిట తథిమి, తకిట తథిమి తందానా..” అంటూ, వియద్వాహినీ తుంగ తరంగ నాట్య భంగిమలు వెలయిస్తాయి. రసావిష్కారానికి ఆటపట్టు, సాహితీ సరస్వతి నుదుట సిందూరపుబొట్టు. రమణీయ, కమనీయ చమత్కృతులతో, యతులతో, జతులతో, సంగతులతో జట్టు. రసజ్ఞతకు హద్దు లేదనీ, పాండిత్యానికి పాదం లేదనీ, ప్రౌఢిమకు పరిమాణం లేదని, ప్రతిభకు మేర లేదని నిరూపించిన కవి వేటూరి.
జీవనరాగం – వేటూరి తొలి రచన (పూర్ణిమ)
1మాకు ఏడెనిమిది తరగతుల్లో ఎప్పుడో, “కోడిగుడ్డంత గోధుమగింజ” అనే పాఠం ఉండేది, తెలుగు వాచకంలో. కథ లీలగా గుర్తుంది. ఒక రాజ్యంలో ఎవరికో ఒక వింత వస్తువు దొరుకుతుంది. దాన్ని రాజుగారి కొలువు తీసుకెళ్ళి చూపిస్తారు. ఆ వస్తువేంటో కనుగొనడానికి చాలా కష్టపడతారు. చివరకో వృద్ధుడు, అది తన కాలంలో పండిన గోధుమ పంట తాలూకూ గింజగా గుర్తిస్తాడు. అప్పట్లో గోధుమ గింజలు ఇప్పటి కోడిగుడ్డంత పరిణామంలో ఉండేవనీ, కాలనుక్రమంగా వచ్చిన మార్పుల వల్ల నాణ్యతలు తగ్గాయని చెప్పుకొస్తాడు. ఈ కథ ఎంత కల్పితమో నాకు తెలీదు. కాని పోయినవారం వేటూరి సుందరరామమూర్తి గారి తొలిరచన, 1959లో “ఆంధ్ర సచిత్ర వార పత్రిక”లో సీరియల్‍గా ప్రచురితమైన నవల “జీవన రాగం” చదివాక, తెలుగు వచనంలో ఉన్న నాణ్యత, ఇప్పటికి మనకి మిగులున్న తెలుగుతో పోల్చుకుంటే, కోడిగుడ్డంత గోధుమగింజ కథే గుర్తుకొస్తుంది. (more…)












Recent Comments