వేటూరి సుందరరామ్మూర్తి

వేటూరి సుందరరామ్మూర్తి
Veturi.jpg
జన్మ నామం వేటూరి సుందరరామ్మూర్తి
జననం జనవరి 29, 1936
కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి
మరణం మే 22, 2010
హైదరాబాదు
నివాసం హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్
ఇతర పేర్లు వేటూరి
వృత్తి సినీ గీత రచయిత
పాత్రికేయుడు (పూర్వం)
మతం బ్రాహ్మణ హిందూ
భార్య/భర్త సీతామహాలక్ష్మి
సంతానం ముగ్గురు కుమారులు

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (1936, జనవరి 29 – 2010, మే 22) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద,[1] శిష్యరికం చేశాడు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత కొన్ని వేల పాటలను రాశాడు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నాడు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.[2] మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాశాడు. 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటు తో మరణించాడు.[3]

జీవిత విశేషాలు

వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు..[4] మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశాడు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాడు.[5]

సినీ ప్రస్థానం

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం… ఇలా ఎన్నో సినిమాలు…ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.

వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.

కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన…, నాదవినోదము….

పుస్తకాలు, ప్రచురణలు

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
px
 • పేరు :సిరికా కొలను చిన్నది[6]
 • రచయిత:వేటూరి సుందరరామ్మూర్తి
 • భాష :తెలుగు
 • ప్రచురణ :2004 వ సంవత్సరం
 • వెల :అమెరికా డాలర్లు 1.57 $
 • కొనుటకు: లింక్

వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్దికెక్కినశ్రీకాకుళం.

Kommakommako sannayi book cover veturi.jpg
 • పేరు :కొమ్మ కొమ్మకో సన్నాయీ [6]
 • రచయిత:వేటూరి సుందరరామ్మూర్తి
 • భాష :తెలుగు
 • ప్రచురణ :2007 వ సంవత్సరం
 • పుటలు : 206
 • వెల :అమెరికా డాలర్లు 3.15 $
 • కొనుటకు: లింక్
  ఉత్తమ సాహితీ సుగందాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించి అర్చిస్తున్నసారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి కలం నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలే ఈ కొమ్మ కొమ్మకో సన్నాయీ.

పురస్కారాలు

సంవత్సరం పురస్కారం పాట భాష సినిమా ఇతర వివరాలు
1994 జాతీయ పురస్కారం రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే… తెలుగు మాతృదేవోభవ
 • నిర్మాత:కె.యస్.రామారావు
 • దర్శకుడు:అజయ్ కుమార్
 • సంగీతం:కీరవాణి

కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా
హోదా ఇవ్వనందుకు నిరసనగా
అవార్డ్ వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

5 thoughts on “వేటూరి సుందరరామ్మూర్తి

 1. వేటూరి వారిని గౌరవించడమంటే మన తెలుగు తల్లికి అర్చనా చేయడమే.ఆ తల్లి పురుష రూపంలో అవతరించి వేటూరిగా సాహితీ సేద్యం చేసింది.ఈ వెబ్ సైట్ నిర్వాహకులకు చాలా ఋణపడి ఉంటుంది తెలుగు జాతి.ఆ మహానుభావుని గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తున్నారు.

 2. Sir,

  we are happy to know about your regard towards Sri Veturi gari work,

  this site is being run by like minded people like you, who are admirers of good literary works,

  we wish them all the best for maintaining sites on Sri Veturi and Sri Jandhyala garu,

  regards, veturi ravi prakash

 3. మీ అభిమానానికి ధన్యవాదాలు సంతోష్ కుమార్ చొప్పల్లి గారూ (టీం-వేటూరి.ఇన్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.