ప్రతిరోజూ వేటూరి డే! (నాగ పావని)

ఆయన కవనం ఒక తెలుగు పవనం
ఆయన పద బంధం శ్రీరాముని భుజాన గర్వంగా నిలబడ్డ రామబాణం 🙏
ఆయన సాహిత్యంతో ప్రకృతి ప్రతిరోజూ పులకరిస్తూనే ఉంది.ఆయన కలంలో ఎన్నో వెచ్చనైన వేవ్ లెంత్ లు
మరెన్నో…పాటల పంక్తులు….😍 రెచ్చిపోయాయి.

ఒక కుర్ర కారు పాడుకునే డ్యూయెట్..లో “వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లో”…అంటూ ఒక ట్రెండ్ సెట్ చేస్తాడు.అది ఆయన చిలిపి పదబంధం.ఎన్నో కుకూలతో కొమ్మారెమ్మా పూసేలా చేశాడు….ఆయన పాటే మంత్రము…మనసే తంత్రము…ఆయన సాహిత్యం నిత్యకళ్యాణం, కమనీయం…అదే మన జీవితం 🙏🙏

కృష్ణ..గోదారుల్లో ఏది బెస్ట్ అని చెప్పమంటాడు😍
వరించిన వలపుల్లో విరించిలా రాయాల… అంటాడు
ఖవాలీల కన్నులు… జిలానీల జాబులు అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన… ప్రత్యేక తెలుగు లిపి ఆయనది.🙏

అఛ్చా అఛ్చా వచ్చా వచ్చా అంటూ.‌‌..తెలుగు ప్రాసకు ఉచ్వాసమయ్యాడు. ఏదేమైనా “నేడేరా నీకు నేస్తము రేపే లేదు! నిన్నంటే నిండు సున్నరా రానే రాదు” అని జీవిత సత్యం..తెలియజేశాడు.

మొత్తానికి మనకోసం వేణువై వచ్చాడు.సాహితీ పవనమై మన మధ్యే నిలిచి పోయాడు.🙏🙏🙏🙏🙏🙏🙏.
వేటూరి సుందర రాముడికి…. జయంతి శుభాకాంక్షలతో..
సండే మండే… ఏమో గానీ నాకు మాత్రం ప్రతిరోజూ వేటూరి డే….అంతే😎😎.

– పావని

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top