‘నిర్ణయం’ – 1991,
నిర్మాణం: జయభేరి ఆర్ట్స్, దర్శకత్వం: ప్రియదర్శన్, రచన: వేటూరి, సంగీతం: ఇళయరాజ,
నటీనటులు: అక్కినేని నాగార్జున, అమల.
ఈ సినిమాకి సంభాషణలను గణేశ్ పాత్రో గారు వ్రాసారు.
వేటూరి గారికి జయభేరి సంస్థతో విడదీయలేని అనుబంధం, ఒకటి వృత్తి పరంగా వారు తీసిన సినిమాలలో 90% సినిమాలకు వేటూరి గారే పాటల రచయిత, మరొకటి మురళీమోహన్ గారు మరియు వారి తమ్ముడు కిశోర్ గారు మంచి స్నేహితులు. అలాగే గణేశ్ పాత్రో గారు క్రాంతి కుమార్ గారి ద్వారా పరిచయమయ్యి మంచి స్నేహితులైనారు.
ఈ సినిమాలో గణేశ్ పాత్రో గారి చేత కొన్ని పాటలు వ్రాయించాలని అనుకుని ఆయనకి పాటల బాణీలను ఇచ్చారు.
ఈ సినిమాలో వేటూరి గారు “మిలా మిలా మెరిసే తార” పాటని వ్రాసి, అందులోని కాలేజీ సన్నివేశాలను మద్రాసులోని లయోలా కాలేజీ గ్రౌండ్లో చిత్రీకరిస్తున్న సమయంలో ఒక రోజు సాయంత్రం అక్కడికి వెళ్లారు. అక్కడ దర్శకులకు తాను వ్రాసిన పాటని ఇచ్చిన తరువాత, అక్కడే ఉన్న గణేశ్ పాత్రో గారు తనవంతు పాటలో పల్లవి సరిగ్గాకుదరండంలేదు కాస్త సాయం పట్టరా అని అడుగగా, వేటూరి గారు “ హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను నిన్నే, కాదంటోంది నన్నే, మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ని”, అనే పల్లవి వ్రాసి ఆయన పాటకు సాయం పట్టారు.
అప్పుడు అక్కడ ఉన్న నాగార్జున గారు ఈ పల్లవి విని చాలా ఆనందించి, ఇక నుంచి మిమ్మలిని నేను ‘హలో గురు’ అనే పిలుస్తాను అని, అప్పటినుండి ఆవిధంగా పిలవడం చేశారు.
ఈ పాట ఆ చిత్రంలోని పాటలలో ఎక్కువ ఆదరణ పొందిన పాటగా అక్కినేని నాగార్జున గారి పలకరింపు పిలుపుగా ‘నిర్ణయం’ అయ్యింది
——————————————
వేటూరి రవి ప్రకాష్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం