“బుల్లెట్” అని బాపూ గారి సినిమా ఒకటి ఉంది (hero kRishnam raaju). ఈ సినిమా లో ఒక చిలిపితనం, కొంటెతనం మేళవించిన సందర్భానికి ఒక duet అవసరమైనది. సరే, వేటూరి గారు రంగంలోకి దిగారు. అలా కారులో వేటూరి వారూ, ముళ్ళపూడి వారు వెళ్తూ ఉంటే ముళ్ళపూడి situation చెప్పడం, వేటూరి పల్లవి చెప్పెయ్యడం, ఆ పల్లవి చూసి ముళ్ళపూడికి వేటూరి ముద్దు వచ్చేయడం అన్నీ జరిగిపోయాయి!! ఆ పల్లవి ఇది:
అతను: రాధ కృష్ణుడికేమిచ్చిందో ఇస్తావా మరి?
ఆమె: సీతకు రాముడేమవుతాడో అవుతావా మరి?
అతను: ముందివ్వు మరి!
ఆమె: ముందవ్వు మరి!!
ఇది చదివాకా “అవును, వేటూరి మరి” అని మనం అనుకోకుండా ఉండలేం కదా!
వేటూరికి ముళ్ళపూడి ముద్దిచ్చివుంటారు. ఔనా ?
Before I read telugu blogs, I used to think Sirivennela writes meaningful lyrics, where as Veturi writes mere gibberish.
వేటూరిగారి విశ్వరూపం కొన్ని బ్లాగులు చదివిన తర్వాతగానీ తెలియలేదు. ముఖ్యంగా మీ బ్లాగు చదువుతుంటే వేటూరివారికి నేనూ ఒక పేద్ద పంకా ఐపోతున్నా 🙂