Melting winter

“ఆఖరి పోరాటం” సినిమాలో “తెల్ల చీరకు” అనే పాట చరణాలలోని lines –

వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా


కార్తీకం కలిసివస్తే నీ పరువం అడుగుతున్నా
హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా!!

ఎంత భావుకత? ఈ ప్రయోగాలు అన్నీ నవ్యమైనవి. ఒక mass పాటలో ఇలాటి lines రాయగలగడం వేటూరికే చెల్లింది.

ఈ పాట పాడిన “లతా మంగేష్కర్”  translation అడిగితే, “యండమూరి వీరేంద్రనాథ్” ఈ పాటని English లోకి translate చేశారుట. భావాల్లో వేటూరి చూపిన “creativity” ని లత ఎంతో మెచ్చుకున్నారుట. ముఖ్యంగా “హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా” అన్న lines ని “I am brushing your beauty with the melting winter!!” అని translate చేసి వినిపిస్తే “ఆహా” అన్నారుట.

“స్వరాభిషేకం” లో సిరివెన్నెల రాసిన “నీ చెంతే ఒక చెంచిత ఉంటే” అన్న పాట రెండో చరణంలో వినిపించే “వెచ్చని ఊహలా వెనువెంటే తరిమిన హేమంతమిది” అన్న lines వేటూరి రాసిన “వైశాఖం తరుముతుంటేనీ ఒళ్ళో ఒదుగుతున్నా” అన్న lines ని గుర్తుకు తెచ్చి, వేటూరి కి సిరివెన్నెల అర్పించిన గౌరవ నివాళి గా అనిపిస్తాయి.

3 thoughts on “Melting winter”

  1. Great explanation. Thank you. Aashaadam is full of clouds and so it is common to have “Urumulu”. I wish you would explain “Vaisaakham Tarumutunte …” also.
    Incidentally we recollected this song recently and listened to it repeatedly in our home.

  2. hai,
    meeru konchem..http://lekhini.org vaadandi…telugu ottulu inka deerghalu artham kavatam ledu..intha baga raase mee vivaranalu chadavadaniki maku kastam ga undi..kastamaina istam kabatti chaduvutunnam.any way nice explanations.
    bye.please folow my suggession.
    thank you.
    suneel.

  3. Sorry to nitpick –

    హేమంతం కరుగుతు ఉంటే .. ఊహ బానే ఉంది గానీ ..
    వైశాఖం, ఆషాఢం, కార్తీకం అన్నీ మాసాలు
    హేమంతం ఋతువు
    పరంపర సరిగ్గా అమరలేదక్కడ. మార్గశిరమో పుష్యమో అనడానికి బదులు హేమంతమే వాడవలసిన అవసరమేమీ కనబడదు.

    BTW, వైశాఖం అంటే వసంతఋతువు ఐపోవస్తోంది, రాబోయేది గ్రీష్మం, మండుటెండ, తాపం – అది తరుముకొస్తుంటే, ఆమె వొడిలో తలదాచుకుంటే రక్షణ – ఆమె వొడి చల్లనిదని కవిహృదయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top