ఏ చికితా కొమస్తాస్!

అసలు ఒక రచయిత రాశాడు అని మనకి అనిపించే పాటలో నిజంగా ఆ రచయిత రాసినది ఎంత? మన సినిమా రచయితలకి తనకి నచ్చినట్టు రాసే పూర్తి స్వేచ్ఛ ఉందా? ఒక ఉదాహరణ చూద్దాం.

“బద్రి” సినిమాలో వినిపించే ఒక popular పాట పల్లవి మొదటి రెండు లైన్లు:

ఏ చికితా కొమస్తాస్!
జాయన్ అయితే జమస్తాస్!

రాసినది వేటూరి. ఈ లైన్లు చదివితే కొంత మందికి వేటూరి మీద కోపం వస్తుంది. అర్థంపర్థం లేని ఈ సాహిత్యం ఏమిటీ అని అనుకోవడమూ న్యాయమే. అయితే ఈ పరిస్థితికి వేటూరే పూర్తి బాధ్యుడు కాదు. వివరాల్లోకి వెళ్తే –

చికితా అన్నది Spanish పదం (chiquita). అర్థం “చిన్నది” అని అనుకోవచ్చు.

పాట “ae chiquita cómo es usted”
అంటే “ఏం చిన్నదానా, ఎట్లా ఉన్నావు” అని అర్థం.

వేటూరి Spanish ఎప్పుడు నేర్చుకున్నాడు అని మనం ఆశ్చర్యపోయేలోపు ఆయనే చెప్పిన విషయం ఇది:

“…అలా Spanish పదాలతో మొదలెట్టమని ఆ hero గారు చెప్పారు. అలాంటప్పుడు ఏదో ఒకటి వ్రాసేయాల్సి వస్తుంది తప్పనిసరిగా! ఆ పాట వ్రాసిచ్చాక నన్ను అడిగారు “చిరుతా అంటే ఏంటండీ అక్కడ?” అని. నేను “చికితా అంటే ఏంటండీ?” అని అడిగాను. ఆ మాటకి Spanishలో అమ్మాయి అని అర్థమని చెప్పారు. అయితే “చిరుతా” అంటే Spanish-లో “చిరు తమ్ముడా” (చిరంజీవి తమ్ముడు – పవన్ కళ్యాణ్!!) అని అర్థం అన్నాను! తెలుగు పదాలిస్తే తెలుగులో వ్రాస్తాము, ఇలా పరభాషా పదాలిస్తే, hero-లు వేలు పెడితే ఇలాగే ఉంటాయి పాటలు!”

(ఈ పాట Spain లో చిత్రీకరించారు కాబట్టి ఇలా hero కోరడం సముచితమే అని కొందరు అభిప్రాయపడొచ్చు. అయితే పాట పరంగా చూస్తే ఇది అత్యుత్సాహమే!

ఇదంతా చదివి, నేను వేటూరిని వెనకేసుకు వస్తున్నాను అనుకునేరు! కాదు! తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పరిస్థితికి గీత రచయిత, దర్శకనిర్మాతలు, హీరోలూ అందరి పాత్రా ఉంది. ఇందరి మధ్యన నలిగిపోతూ సినిమా పాట సాహిత్యం బిక్కు బిక్కు మంటోందని గుర్తుచెయ్యడానికే ఈ వ్యాసం.

(ఈ వ్యాసం లోని చాలా వివరాలు అందించిన Orkut మిత్రులు నచకి, విద్యనాథ్ గార్లకి కృతజ్ఞతలు)

7 thoughts on “ఏ చికితా కొమస్తాస్!”

  1. Oh!! Many time in my friend circle we wondered how Veturi could create a word such “Chikita” and we complimented him for the rhyming word “Chiruta”.

    I do not believe that Telugu people asked Veturi the meaning of “Chiruta”. Everybody knows that it is leopard. This meaning suggests the speedand vigor of the hero. “Chiru Tammudaa” – Veturi might have told this to generate some humour.

  2. స్పానిష్ లో చీక అంటే అమ్మాయి. ఈతా అనే suffix ఎదైనా చాలా ముద్దుగా (చిన్ని, పొన్ని లాగా ) ఉంటే తగిలిస్తారు.
    ఆనా ను ముద్దుగా పిలవాలంటే అనీతా అంటారు
    సారా ను ముద్దుగా సరీతా అంటారు.

  3. నాకైతే పాట అలా మొదలవడం నచ్చింది.మరీ పట్టువిడుపులు లేకుండా బిగించి కూర్చొంటే ఏ భాషకైనా మంచిది కాదేమో? మరి సినిమా పాట అన్నాక క్యాచీగా లేకపోతే ప్రేక్షకులకు కూడా నచ్చకపోవచ్చు.ఆ పాట సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంది.కానీ మీ విశ్లేషణ బావుంది.

  4. వేటూరిని వెనకేసుకు రావలసిందే.. అయితే చికితా కోసం కాదు (ఆ మాత్రం రాసేందుకు వేటూరి అక్కరలేదు), వేటూరి గొప్పదనం చిరుత కు అర్థం చెప్పడంలో ఉంది. రాసినప్పుడే చిరు తమ్ముడనే అర్థంలో రాసి ఉండొచ్చు, లేదూ అలవోకగా అలా రాసి పారేసి ఉండొచ్చు కూడా. యథాలాపంగా వాడిన పదానికైనా సందర్భోచిత అర్థం చెప్పడం గొప్ప కవుల లక్షణం – ఏమి చెప్పుదున్ ‘గురునాథా’ లాగా! వేటూరి మన గొప్ప కవుల్లో ఒకరు కాబట్టే చిరు తమ్ముడు చిరుత అని చెప్పగలిగారు.

  5. వేటూరి గారి లెవెల్ కి ఇలాంటి పాటలు తన మైండ్ లో ఒక 20% వాడితే వచ్చేస్తాయి. పూర్తీ concentration దాని మీద పెట్టక్కర్లేదు. అందుకని చిరుత అని అనడం లో rhythmic గా వుంటుంది అనే తప్ప, వేరే వుద్దేశ్యం ఏమి ఉంది ఉండదు అని నేను అనుకుంటున్నా. ఏదో హీరో గారు అడిగారు కదా.. చెప్పేస్తే పోలా అని ఒక చెణుకు వేసి వుంటారు అప్పుడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top