నువ్వు తిన్న మనువ్వు తిన్ననువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది.. చెప్పావా ఇలా..
పోతన్న కైతలకు భాష్యం వెతికావా ఇలా..
శరణు సుందరరామా శరణు..
ఇక్కడ పద్మశ్రీలు ఇక్కడ మరొక్క పురస్కారమూ ఏవీ ఏవీ నీ సాటి రావు.
అదిగో అందాలలో మహోదయం..ఆహా! తెలుగు నుడి కారమా ఆ తమిళ మొ యిల్ దారులకు వాడు సంబరపడిపోయాడు..కొట్టండి తిట్టండి ఏమైనా చేయం డి అదే ప్రేమనా ఆహా ఇళయరాజా నవ్వాడు/వాడు మా కవి.. తెలుగు కవి.. అంటూ ఆ హర్మోనియం మెట్లను అలవోకగా పలికించేశాడు..విన్నాను విన్నాన మ్మా విన్నాను..అవి కిన్నెర పాటలు అని ..అది విశ్వ నాథ పలుకుకు ఒకింత కొనసాగింపు అని!ఏదయినా గతం ఏదయినా స్వాగతాలు చెప్పాలా..ఏంట య్యా ఇది..ఆ వాయులీన స్వరాలను వదిలిపోవాలి కదా!తెలియదా నీకు..మా అందరికీ ఒకింత జ్ఞానమా..జ్ఞానోదయమా.. తెలియదు..
సుందరరాముడు అంటే తెలుగు..నుడికారంగా భాసిల్లిన తెలుగు..భాషా ఎక్కడి కి పోతుంది..ఈ ఇంగ్లీషు వాడు పట్టుకుపోతాడా అన్న తెలుగు..తెలుగే! వాడి చెంత వెలిగే! తానై వచ్చిన స్వరము.. కొమ్మలు తాకిన ఆమని వాడే.. ఆహా రాలేటి పూలా ఇవి రాగాలా ఇవి..ఎంగిలి బతుకంతా ఎంగిలి..మదికి ఇంత సి న్సియర్ సినీవాలినా..తెలియదు..అవున్రా! వెల్లువ లేదు..వెన్నెల లేదు..ఎ ల్లకిల్లా పడిన గోదావరి లేదు..నీవు ప్రేమించిన వా డెవ్వడూ ఇచ్చట లేడు.. పూసేటి పూలా ఇవి.. తెలియవు.. గంధాలా ఏ చోట దొరుకును.. మనసా వాచా నిన్నే తలచా! కాదనకు..
ఇన్ని మేఘాలను పోగేసిన ఆకాశం ఇన్ని చినుకులను ఇచ్చి పోయిన సంద ర్భాలను తప్పక తల్చుకోవాలి.చినుకులు తేనె చినుకులు..బాల్యాన్ని నడిపిన చినుకులు..బాల్యంలో ఆగిపోయిన చినుకులు..యవ్వనాన్ని ఆరేసుకున్న య వ్వనాన్ని చీకటిని చీకటి చెంత ఆరేసుకున్న ప్రాయా న్ని అందంగా అనున యించిన చినుకులు.పదాలను పోగేసిన చినుకులు..పదాల్లో ఒదగని చినుకు లు..అవును ఆ పిల్లన గ్రోవి గాయాలను మా న్పని చినుకులు..దేహం అంతా గాయాలయ్యాక ఒంటిని తడిమి కౌగిలింతగా మారాయా ఈ చినుకులు..అబ్బా !వేటూరి.. ఇప్పటి పద్మశ్రీలు అం తా వాడి దగ్గర అతి చిన్న..సాహిత్య కెరటం సాహిత్య సముద్రం అబ్బా!ఏంట్రా ఈ మెటఫర్లు..చేతగాక రాయడం లేదు కదా మీరంతా!మాతృమూర్తులకు నివేదనగా మారిన వాడికి గర్భశోకం అర్థం మనం చెప్పాలా..ఆహా! వేణువు ఒక వేణువు ఆహా! హృదయం నాలో నీలో రవళించి న స్వరా లకు ఆనవాలు ఆ హృదయం.. మనుషులే వీరే మనుషులు..నిర్థార ణ..ధారణ..
పరంపర ధారణ
పరంపరను నిశ్చింతగా నిశ్చయం చేసింది ఈ నిర్థారణ
ఏ కులమూ నీది .ప.. ద..ని ..స..
అవునా .. స్వరములు ఏడే .. అవునా.. నీవు ఎనిమిదో స్వరమా..
వారెవ్వరో అన్న రీతిన ఎనిమిదో రంగునా!
తెలియదు వివర్ణ సమూహాలను ప్రేమించడం నేర్పిన వాడివి
మా బతుకు నటన అని తేల్చిన వాడివి
ఆలంకారికంగా శబ్ధాన్ని ఇచ్చిన వాడివి
నీ దగ్గరా ఈ ఆటలు..
చెల్లింప దగునా!!!
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే..
పత్రికల్లో కొన్ని వాక్యాలను పోగేసిన సబ్ ఎడిటర్..పత్రికల్లో కొన్ని శీర్షికలను మహత్తరంగా మలిచిన సబ్ ఎడిటర్ రాక్షస అక్షరాలకు దైవతమా..హాహాహా కా నీ ఏది రాక్షసమో ఏది దైవతమో తెలియాలి కదా!వేటూరి వారింటి సోయగాని కి అవన్నీ తెల్సు..నేనా చాలా చిన్నవాణ్నండి..పెద్దవా రందరి దగ్గర చిన్న..చి న్నవారందికీ ఓ పెద్ద అంతే..అంతకుమించి ఏమీ లేదు..
మన మధ్య లేని వారంతా మంచి వారని ఓ సూత్రీకరణ.చెడ్డవారు మంచి వారు అంటూ ఉండరని ఓ వ్యక్తీకరణ..మనిషే కదా వాడు అన్న జాలి..వీటికి ఆవల ఎ వ్వరైనా ఉంటారా..అన్న మీమాంస..మనుషులే వీరంతా అన్న ఓ చిన్న మిన హాయింపు..ఇక్కడే ఆగిపోదాం..ఈ రోజు (జనవరి 2 9) వేటూరి జయంతి కదూ ..స్మరిద్దాం..ఆ వేగ గతికి..ఆ ఝంఝానిలానికి వందనాలు చెల్లిద్దాం..కృష్ణా తీరే ..ధీర సమీరే..!నమామి..
—————————————————————————————————————-
రత్నకిషోర్ శంభుమహంతి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం