గోదావరి పుష్కర గీతం-2: (వేటూరి)

godavari-pushkaralu-tni

 

 

 

 

 

వేటూరి గారు 2003 గోదావరి పుష్కరాల సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి వ్రాసిన కవితా గీతం: 

పల్లవి:

ఆనాటి నాపాట గోదావరి

నానోట పలికేను ఈనాటికి

తేనె తెలుగుల తేట గోదావరి

వేయి వెలుగుల బాట గోదావరి

 

అనుపల్లవి:

కంటి సిరిగా పారి కండసిరిగా మారి

కడుపు సిరిగా తల్లి పండేవరి

గోదావరి గోదావరి -!!

 

చరణం(1):

బాపిరాజూ నవల కృష్ణశాస్త్రీ కవిత

బాసగా పలికింది గోదావరి

దామెర్ల చిత్రమై రమణీయ హాస్యమై

బాపు గీసిన గీత దాటనీ జానకై

తరలి వచ్చిందమ్మ గోదావరి

పొరలి పొంగిందమ్మ గోదావరి-!!

 

చరణం(2):

చిలకమర్తిగ చిలికె చిలిపి సరసాలు

కందుకూరిగ వెలిగె జ్ఞానకిరణాలు

పానుగంటికి చాలు సాక్షిపాఠాలు

అమ్మ భారతి ఉన్న బాసరే చాలు

నటనాట్య రసరాజ్య గాన గాంధర్వాల

నది జీవనది భావనదిలో తరంగాల

కదలి వచ్చిందమ్మ గోదావరి

కధలు చెప్పిందమ్మ గోదావరి-!!

Godavari-Pushkaralu1-2015

 

 

 

 

 

 

————————————————————-

వేటూరి రవి ప్రకాష్ గారికి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్

3 thoughts on “గోదావరి పుష్కర గీతం-2: (వేటూరి)”

  1. ఎంతటి చక్కనైన పాట. ఒక్క వేటూరి మాత్రమే వ్రాయగలిగిన పాట. అంత మంది సాహితీమూర్తులను స్మరిస్తూ వ్రాసినది. “కంటి సిరిగా పారి, కండసిరిగా మారి, కడుపు సిరిగా తల్లి పండేవరి, గోదావరి గోదావరి” — ఈ ఒక్క పంక్తి చాలు అండి వేటూరి ప్రతిభకు గోదావరి అంత పొడుగైన అద్దాన్ని పట్టడానికి. నమో నమహ్@ వేటూరి.

    ఇది మనకు అందించిన శ్రీ రవి ప్రకాశ్ గారికి నమస్సులు. అయ్యా – మీ తండ్రిగారు చాలా హర్షించే పని చేస్తున్నారు.

  2. Dear Sandeep garu,

    maa thandri gariki endaro abhimana puthrulu, puthrikalu vunnaru, meerandaru aanandinchenduku, Thalli Godavari, aame parisaralalo putti perigina Mahaneeyulanu Thalachukovalane sankalapamtho, mee andariki aayana vrasina paatalani daggara chesthunnamu,

    ee prayathnam dwara mee lanti endaro agrajulanu, anujulanu pondadame maa adrustamu,

    dhanyavaadamulatho, veturi ravi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top