కొంత కాలం తర్వాత ఒక సినిమా పాట గురించి వ్యాఖ్యానం రాస్తున్నాను. ఈ సారి ఎంచుకున్న పాట ప్రత్యేకమైనది. ఇది గొప్ప సాహితీ రచన కాదు సరి కదా చాలా మందికి ఇది అసలు ఏ విశేషమూ లేని ఒక mass song అనిపిస్తుంది. కాని తరచి చూస్తే ఈ పాటలో చాలా విశేషాలు ఉన్నాయ్. ఈ పాట సైనికుడు చిత్రం లోని – “ఓరుగల్లుకే పిల్లా”
చాలా మంది అనుకున్నట్టు ఇదొక మాస్ గీతం కాదు, సందర్భోచిత గీతం – ప్రతినాయకుడిని ప్రేమించే హీరోయిన్ ని హీరో kidnap చేస్తాడు. వారిద్దరి మధ్య సంభాషణగా సాగే పాట ఇది. అయితే folk tune కాబట్టి కొంత mass పోకడలు ఉన్నాయి. దీనిని కూడా గీత రచయిత సమర్థవంతంగా బేలన్స్ చెయ్యాలి.
Note: “లంకేశా లవ్ చేశా” అన్న వాక్యానికి అర్థం వివరించడం ద్వారా ఈ పాట మొత్తాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడిన మిత్రుడు సందీప్ కి many thanks!
ఓరుగల్లుకె పిల్లా పిల్లా వెన్నుపూస ఘల్లుఘల్లుమన్నాదే
ఓరచూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే
జవనాల ఓ మథుబాలా
ఇవి జగడాలా ముద్దు పగడాలా
ఆ అమ్మాయిని చూసి ఓరుగల్లు ఊరుకే ఉత్సాహం వచ్చి నాట్యం చెయ్యాలనిపించింది అట. “వెన్నుపూస ఘల్లుఘల్లుమంది” అనడం అతి చక్కని పదచిత్రం. ఓరుగల్లుకి ప్రాసగా “ఓర చూపులు” అనడమూ బాగుంది. “ఏకవీర” ఎవరో నాకు తెలియలేదు. బహుశా వరంగల్లు చరిత్రకి సంబంధించిన నాయికో దేవతో అయ్యి ఉండాలి. విశ్వనాథ వారి “ఏక వీర” ఇదో కాదో తెలియదు. మీకు తెలిస్తే comments లో చెప్పగలరు. ఇక పల్లవిలో వినిపించే “జగడాలు” ఒక స్పర్థని సూచిస్తోంది. ఈ స్పర్థనే పాటలో సరదాగా రచయిత చిత్రించారు. జగడాలకి, పగడాలు ప్రాస పాతదే అయినా, “ముద్దు పగడాలు” అనడం నవ్యం. అంటే నీ బుంగమూతి జగడం కూడా ముద్దుగా ఉంది అనడం.
లా లా లా పండు వెన్నెలా
ఇకనైనా కలనైనా జతకు చేరగలనా
తొలి వలపు పిలుపులే వెన్నలా
ఆ అమ్మాయి ప్రేమలో ఉంది. అందుకే వెన్నెల వలపు పిలుపులా వెన్నగా తోచింది. కాని తన ప్రియునికి దూరంగా ఉంది ఇప్పుడు. ఎప్పటికైనా జత చేరగలనా అనడంలో “నువ్వు ప్రియుని నుంచి నన్ను దూరం చేశావ్” అని హీరోని నిందించడం కొంత కనిపిస్తోంది.
అందాల దొండపండుకు మిసమిసల కొసలు కాకికెందుకు
అది వీడా సరి జోడా తెలుసుకొనవె తులసీ
ఆ అమ్మాయి అభిమానించే ప్రియుడు మంచి వాడూ కాదు, అందగాడూ కాదు. ఆ కాకి ముక్కుకి దొండపండు లాంటి నువ్వు ఎందుకు అంటున్నాడు. మొదటి వాక్యం చూడండి – దొండపండు కాకికి ఎందుకు అని చెప్పాలి. కాని tune length ఎక్కువుంది కాబట్టి కొంత పొడిగించాలి. ఇలాటి చోటే కవి ప్రతిభ తెలుస్తుంది. “అందాల దొండపండు”, “మిసమిసల కొసలు” (ఇక్కడ మిసమిస – కొస అంటూ మళ్ళీ ప్రాస) అనడం ఈ మామూలు వాక్యనికి ఎంతో అందం చేకూర్చింది. “తులసీ” అని ఆ అమ్మాయిని సంబోధించడం కూడా చాలా బాగుంది. అంటే ఆ ప్రతినాయకుడు గంజాయి మొక్కైనా ఈ అమ్మాయి తులసి లాటిది. హీరోయిన్ పై హీరోకి గల అభిమానం కొంత ఇక్కడ కనిపిస్తుంది.
చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు
ఈ వాక్యం మణిపూస. ట్యూన్ లో వింటే ఎంతో అందంగా ఉంటుంది. తను ప్రేమించిన ప్రియుడు ఎలాటి వాడైనా తనకి వాడే గొప్ప. ఇంక ఎవరూ పోటీ రాలేరు. ప్రేమ కలిగించే మత్తు అలాటిది. అందరూ ఎరిగిన ఈ సత్యాన్ని ఎంతో చక్కగా చెప్పారు.
కా..కా..కా కస్సుబుస్సులా
తెగ కలలు కనకు గోరు వెచ్చగా
తలనిండా మునిగాకా తమకు వలదు వణుకు
ఇక్కడ “కస్సుబుస్సులా” అనేది ఆ అమ్మాయికి సంబోధన. ఇదో వేటూరి చమత్కారం. “నువ్వు ప్రేమ మత్తులో నిండా మునిగిపోయావ్. అందుకే నీకు వణుకు తెలియట్లేదు” అని ఆ అమ్మయిని కాస్త మందలించడం అన్న మాట. ఎంత ముద్దుగా వేటూరి దీనిని వ్యక్తపరిచాడో చూడండి.
దా దా దా దమ్ములున్నవా
మగసిరిగ ఎదురు పడగలవా
లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాణ్ణి
అయితే ఆ అమ్మాయి ఒప్పుకోదు కదా! తన ప్రియుడే రాముడు. హీరో రావణుడు తనకి (రావణుడు సీతని ఎత్తుకొచ్చాడు గా మరి). నీకు దమ్ముంటే ఇలా నన్ను ఎత్తుకు రావు, ఇప్పుడు ఏవో మాటలు చెప్తున్నావ్ గానీ అంటోంది. “లంకేశా లవ్ చేశా” లాటి పద గారడీలు వేటూరికి అలవాటే కదా.
ఎద ముసిరిన మసకల మకమక లాడిన మాయే తెలుసా
ఇది వేటూరి మాత్రమే రాయగలిగిన వాక్యం. అంటే మిగతా రచయితలు రాయగల సత్తా లేని వారని కాదు. “మకమక లాడడం” లాటి మరుగున పడిపోయిన ప్రయోగాలని ఎవరూ ఇలాటి పాటల్లో వాడాలనుకోరు, వేటూరి తప్ప. ఇక్కడ మనసుని “ముసిరిన మసకల మకమకలాడిన మాయ” అని నిర్వచించారు వేటూరి. “మకమక లాడడం” అంటే అస్పష్టంగా ఉండడం – గుడ్డి వెలుతురులా ఉండడం అన్న మాట. ఇక్కడ మకమకలాడుతున్నది ఒక మాయ. ఈ మాయ వల్ల కన్ను స్పష్టంగా విషయాలని చూడలేకపోతోంది. ఎందుకు మకకలాడుతోంది అంటే “ముసిరిన మసకల” వల్ల – మనలో కమ్ముకున్న మన అహంకారం, అజ్ఞానం వల్ల అన్న మాట. తాత్త్వికులు ఎప్పుడో చెప్పిన నిర్వచనమే ఇది. దీనిని ఇంత చమత్కారంగా ఇలాటి పాటలో చెప్పిన వేటూరిని “సాహో” అని పొగడక తప్పదు!
మొత్తానికి ఈ పాట చక్కని రచనే. కొంత mass touch తో రాస్తూనే చక్కగా, చమత్కారంగా రాయడం ఎలాగో ఈ పాట చూసి నేర్చుకోవచ్చు. వేటూరి ఇలాటి పాటలు గతంలో ఎన్నో రాసినా ఈ మధ్య కాలంలో రాయడం ఇదే అనిపిస్తుంది. ఇలాటి పాటలు ఇంకా ఆయన రాయాలని కోరుకుందాం.
WoW
నేనెప్పుడూ ఇది మాస్ అనుకోలేదు.ఇంకో రీజన్ ఉంది.గుణశేఖర్ దీన్ని రామయణం బేస్ చేసుకొని, దాన్ని కొన్ని ట్విస్ట్స్ చేసుకొని చూసాడు 🙂 అని నా ఫీలింగ్.
సీత రాముడ్ని కాక, పొరబాటున రావణాసురిడిని లవ్ చేస్తే…ఎత్తుకుపోయేది ఈ సారి రాముడైనా, స్టోరీలు వనవాసం రావాలి! బ్రిడ్క్ కూడా రావాలి! ఇలాంటీ కొన్ని గమ్మత్తైన ఆలోచన్లున్నాయి నాకు..వాడిలా ఆలోచించాడా లేదా అనేది నాకు తెలీదులెండి.కానీ ఇలా చెప్పటం వల్లే.వేటూరి మాస్ సాంగ్ లా కనిపించే ఈ పాట రాసిచ్చాడని మరో ఎదవాలోచన.
నిజానికి రాముడిని రివర్స్ చేసి, ట్విస్ట్ చేసి, రాబిన్ హుడ్ ను చూడచ్చు లెండి…నా దంతా అదో గోల..
బహుసా అలా ఆలోచించడానికి కారణం ఈ పాట కావచ్చు:
“అది వీడా సరి జోడా తెలుసుకొనవె తులసీ ”
“చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు”
“లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాణ్ణి ”
నాకు ఈ మూడు లైన్లే ఎప్పుడూ వినిపిచ్చేవి; మిగితా అంతా నేను, ఓరుగల్లు కే పిల్లా నన్నా నిన్నా …నన్న్నాన ఉన్నావే ….” అంటూ “న న న” ట్యూను పాడుకునే వాణ్ణి.
మీరు చెప్పాక మొత్తం చూస్తున్నా.. చాలా బావుంది.
ఈ పోస్టు నచ్చింది….. అది ఏకవీర “నవ్వులా” ఉన్నావే ఏమో..ఒ సారి సరి చూడండి..
ఐ యూజ్డ్ థింక్…మొనలిసా స్మైల్ లాగా ఏకవీర నవ్వా అని……టూ…మచ్ ఆలోచిస్తున్నానా….
మొనాలిసా అనంగానే…
ఉషా ఉషా….నిషా నిషా….నవ్వుల్లో మొనాలిసా…అని అదేదు నరేష్, వాణీవిశ్వనాధ్ పాట
ఔనూ…రామాయణం బేస్ చేసుకొని సినిమా తీస్తున్న మణీరత్నం కి మూడో సారి గుండెపోటొచ్చిందని విన్నాను….ఏమైందో…..
Ekaveera anedi priyuraliki vade visheshanam ..sanskrit meaning untundi ..@Eka ane padam tho…idi manasuku sambandhinchina peru pratyekam ga….inka yekkuva cheppali ante confirm chesukovali 🙂
mee vyakyanam bagundi ….ee song intha adbhutam ga untundi anukoledu ….thank u
chaala bavundi phani garu. very interesting.
Good analysis…Well done..