వికృతి నామ సంవత్సరం సందర్భంగా వేటూరి వ్రాసిన కవిత:
నల్ల కోకిలా
నువ్వు తెల్లబోకు ఇటకు చేరి
ఎవరూ వినరిక్కడ
నీ తెలుగు పాట కచేరీ
గండు తుమ్మెదా
నువ్వు కదలిరాకు మా తోటకి
సాక్షివి కాలేవు నీవు పూల ఆత్మహత్యకి
ఆరు రుచులు దొరకవులే
అడగకు ఉగాది పచ్చడి
వేప చేదు తగిలి విరిగే
తేనె ద్రాక్ష మామిడి
పేరును నిలబెట్టుకుంది
పోతూ పోతూ “విరోధి”
“వికృతి” ఏంచేస్తుందో
మనకొద్దీ ఉగాది
———————————————
వేటూరి రవి ప్రకాష్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్