వేటూరి గారు 2003 గోదావరి పుష్కరాల సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి వ్రాసిన కవితా గీతం:
పల్లవి(1):
శ్రీరామ పాదాలు కడగంగా
రామదాసుని నోట తిరగంగా
నన్నయ్య గంటాన సుడులు తిరుగుతూవచ్చి
తెలుగింటి వేదమై భూదారి గంగ
మా వాడకొచ్చింది గోదారిగంగ…
చరణం(1):
కోనసీమా ఆకుపచ్చ చీరకట్టి
కోటిలింగాలతో మెడకు హారాలెట్టి
పాపికొండలపైట పరువాలకే చుట్టి
శబరితో కలిసింది గౌతమై కరిగింది
దక్షిణాదికి గంగ గోదారిగంగ
దక్షవాటికి చేరె నేడు శివగంగ..
చరణం(2):
వెన్నెలంతా మేసి తాను నెమరేసింది
ఎంకి పాటలు పాడి ఎల్లువైపోయింది
పడతి కిన్నెర్సానిలా పరుగులెత్తింది
పదములే పాడింది పైరులై పండింది
శ్రీనాధ సీసమై శృంగార గంగ
వీరేశలింగాల విజ్ఞానగంగ..
——————————————————–
వేటూరి రవి ప్రకాష్ గారికి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్
godavari cinemalo pata kuda ilane vunnadi