దేహం తిరి!

దేహం తిరి? ఏమిటీ కిరి కిరి! ఈ అర్థం పర్థం లేని పాటేంటి? ఒక వేళ అర్థముంటే అర్థం కాకుండా చెయ్యడానికే అన్నట్టు disco tune ఏమిటి? అర్థం కావడం మాట దేవుడెరుగు, కనీసం మాటలు కూడా సరిగ్గా వినబడ్డం  లేదే!

ఇవీ “యువ” చిత్రంలో “దేహం తిరి” పాట మొదటిసారి విన్నప్పుడు నాలో మెదిలిన భావాలు. ఈ భావాలు ఇప్పటికీ పెద్ద మారలేదు. అయినా ఈ పాట గురించి ఎందుకు రాస్తున్నాను అంటే, సంగీతపు రొదల మధ్య ఒక సెలయేటి గీతం ఉంది కాబట్టి. గొప్ప భావం ఉంది కాబట్టి.

ముందుగా ఈ పాట గురించి కొంత చెప్పుకోవాలి. ఇది తమిళ కవి వైరముత్తు రాసిన ఒక కవితా సంకలనంలోని కవిత. అంశం ప్రేమ. ఈ కవిత “యువ” సినిమా దర్శకుడు మణిరత్నానికి నచ్చి సినిమాలో వాడుకున్నారు. ఈ తమిళ పాట గురించీ, ఆ పాట భావం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు – yakkai tiri

Vairamuthu

సరే ఇప్పుడు తెలుగుకి వద్దాం. వేటూరి దాదాపు వైరముత్తు భావాలనే అనువదించారనీ, ఇందులో కొంత భావాన్ని వధించారని కూడా తెలుస్తోంది! కానీ చాలా వేటూరి పాటల్లో లాగే ఈ వధింపుని దాటి మథిస్తూ పోతే అమృతం దొరుకుతుంది!

ముందుగా పాట సాహిత్యం (చాలా సార్లు వినగా వినగా నాకు వినిపించినది!) –

దేహం తిరి వెలుగన్నది, చెలిమే

జీవం నది యద నీరధి, నెనరే

పుటకే పాపం కడుగు అమృతం, చెలిమే

హృదయం శిల శిలలో శిల్పం, చెలిమే

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం వదులుకోం

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం

జన్మాంకురం కాంక్షే ఫలం

లోకం ద్వైతం కాంక్షే అద్వైతం

సర్వం శూన్యం శీర్షం ప్రేమ

మనిషి మాయ చెలిమి అమరం

లోకానికి కాంతిధార ఒకటే

ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే

veturi-sundararama-murthy

ఈ పాట ప్రేమ గురించి అని చెప్పుకున్నాం. ప్రేమ కన్నా అపార్థం అయ్యే పదం ప్రపంచంలో ఇంకేది లేదు కనుక, అసలు ఈ ప్రేమ ఏ ప్రేమో ముందు తెలుసుకోవాలి! ఇక్కడ ప్రేమ, ప్రేయసీ ప్రియుల ప్రేమ కాదు. దైవత్త్వం నిండిన ప్రేమ. సార్వజనీనమైన ప్రేమ. ప్రపంచాన్ని కడిగే ప్రేమ. ఇప్పుడు పాటలోకి వెళ్దాం.

“దేహం తిరి” అన్నారు. తిరి అంటే? తమిళ పాటలో భావం ప్రకారం ఈ పదానికి “దీపపు వత్తి” (wick, in English) అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ బ్రౌన్ డిక్షనరీ చూస్తే ఈ పదం కనిపించలేదు. సో, తమిళ పదాన్నే వాడేశారా? మా అమ్మని అడిగితే ఒక సమాధానం దొరికింది. వైజాగ్ ప్రాంతంలో ఈ పదం వాడుకలో ఉండేదట. “తిరి పెట్టు” అంటే “దీపం వెలిగించడం” అని అర్థమట. కాబట్టి ఈ మరిచిపోయిన/మరిచిపోతున్న తెలుగు పదాన్ని మళ్ళీ పరిచయం చేసినందుకు వేటూరిని అభినందించొచ్చు.

దేహం తిరి వెలుగన్నది చెలిమే

అంటే, దేహం (body) కేవలం వత్తి. వెలుగు అంతా ప్రేమ! ఇక్కడ “చెలిమి” అంటే ప్రేమ అని అర్థం తీసుకోవాలి.

జీవం నది యద నీరధి నెనరే

జీవం అంటే ఇక్కడ “జీవితం” (Life) అని అర్థం చెప్పుకోవాలి. నీరధి అంటే సముద్రం. నెనరు అంటే ప్రేమ. ఈ వాక్యానికి అర్థం – ” జీవితమనే నదికి పరమార్థమైన సాగరం ప్రేమ”. నదులుగా కనిపించే భిన్నత్వం లోంచి సాగరం అనే ఏకత్వం సిద్ధింపజేయడం ప్రేమ లక్షణం.

పుటకే పాపం కడుగు అమృతం చెలిమే

మన హైందవ సిద్ధాంతం ప్రకారం పాప ఫలం అనుభవించే వరకూ పుట్టుక తప్పదు. ఈ జనన మరణ వలయం నుంచి విముక్తి కలిగించే మోక్షం ప్రేమ. ఇదొక అర్థం. ఇలా కాకుండా – “మనకి పుట్టకనుంచీ ఉన్న కల్మషాలని కడిగే అమృతం ప్రేమ” అని simpleగా అర్థం చెప్పుకోవచ్చు.

హృదయం శిల శిలలో శిల్పం చెలిమే

మనసు ఒక శిల లాటిది, జీవం లేకుండా. ఆ శిలలో దాగిన శిల్పం ప్రేమ. అంటే ప్రేమని సిద్ధించుకుంటే శిల్పాలమౌతాం. లేదంటే శిలల్లా పడిఉంటాం. తమిళ భావంలో “శిలని శిల్పంగా మలిచే శిల్పి ” ప్రేమ అని ఉంది. కానీ వేటూరి శిల్పమే ప్రేమ అని మరింత గొప్పగా చెప్పారు!

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం వదులుకోం

తాకుతాం రగులుతాం భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం

ప్రేమ నిజానికి ఒక abstract concept. Concrete objects నే  స్పర్శించగలం. కాబట్టి ప్రేమని స్పర్శించడం అంటే ప్రేమని పక్కనే ఉన్న ప్రాణానిగా, స్నేహానిగా ఆత్మీయంగా స్పర్శించగలిగేంతగా నింపుకోగలగడం. ప్రేమలో రగలాలి, ప్రేమని భరించాలి కూడా. మోక్షాన్నిచ్చే ప్రేమ అంత సులువుగా రాదుగా మరి! ఏదేమైనా ప్రేమని వదులుకోకుండా, చెదిరిపోకుండా ఉంటామని ఇక్కడ భావన. తద్వారా ప్రేమ గొప్పతనాన్ని చెప్పడం.

జన్మాంకురం కాంక్షే ఫలం

ఇక్కడ “కాంక్ష” అంటే ప్రేమ. మరి, ప్రేమే ఫలం అని రాయొచ్చుగా, tune కూడా సరిపోతుంది? తమిళంలో “కాదల్” అన్న పదానికి lip sync కోసం “కాంక్షే” అని రాసినట్టు తోస్తోంది. అంకురం అంటే విత్తనం. మానవ జన్మ ఒక విత్తనమైతే, ప్రేమ సంపూర్ణమైన ఫలం (fruit). విత్తనంగానే ఉండిపోకు, ఎదిగి పరిపక్వత పొందు అని సందేశం.

లోకం ద్వైతం కాంక్షే అద్వైతం

అద్వైతం అంటే “వేరుగా చూడకపోవడం” అని simple గా అర్థం చెప్పుకోవచ్చు. జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్త్వికులు చెప్పిన విషయం ఏమిటంటే – When Ego ends, Love begins. “నేను” అని ఒకటుంటే నేను కానిది, నానుంచి వేరైనది ఇంకోటి ఉండి తీరాలి. అసలు నేనే లేకపోతే అంతా నేనే. అప్పుడు తేడాలన్నీ మాసిపోతాయి. శంకరుల అద్వైత సిద్ధాంతం ఇదే. లోకంలోని అణువణువులోనూ, కనిపించే ప్రతి మనిషిలోనూ నిన్నే చూసుకున్న నాడు, నీలో ఒక సరికొత్త ప్రపంచం ఆవిష్కరింపబడుతుంది.

సర్వం శూన్యం శీర్షం ప్రేమ

మనిషి మాయ చెలిమి అమరం

ఈ రెండు వాక్యాలకీ దాదాపు అర్థం ఒకటే. శీర్షం అంటే సమున్నతం అని అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ. అంతా శూన్యం (సున్నా), ప్రేమ మాత్రం సమున్నతం (అనంతం). జగమే మాయ అంటే అసలు అర్థం ఇదే. తెలుసుకుంటే ప్రేమ తప్ప ఇంకేది లేదని తెలుస్తుంది అని వేదాంతుల వాక్కు. మనిషీ, మరణం మాయైతే మరణం లేనిది ప్రేమ ఒక్కటే.

లోకానికి కాంతిధార ఒకటే

ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే

ఇప్పటి దాకా వేటూరి తమిళ భావాలనే అనువదించినా, ఈ రెండు వాక్యాల్లో మాత్రం తన గొంతు వినిపించారు. తమిళ పాటలో – “ఉన్నది ప్రేమ ఒకటే. తనువులు మారీ మారీ ఈ ప్రేమలోనే పుడుతూ పోతూ ఉంటాయ్” అన్న భావం ఉంది. మరి వేటూరికి ఈ భావం నచ్చలేదో, Tune సరిపోలేదో ఇంకో గొప్ప భావం రాశారు. లోకానికి కాంతిధార కేవలం ప్రేమ ఒకటే అన్నారు. ధారగా కురుస్తున్న ప్రేమని ఊహించుకోండి. వెలుగు వెలుగు వెలుగు. అనంతమైన వెలుగు కురుస్తోంది. కానీ మనం కళ్ళు మూసుకున్నాం. చీకట్లో ఉన్నాం. మన ఉదయానికి వేకువనిచ్చే (ఉదయం అంటే ఇక్కడ జన్మ (birth) అని అర్థం చెప్పుకోవాలి) ఆ వెలుగుని చూడలేకున్నాం. కళ్ళు తెరవండి, మేల్కోండి, వెలుగుని కనరండి!!

ఇంత గొప్ప పాటని రాసిన వైరముత్తుకి ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. కొంత కష్టపెట్టినా, గొప్పగా అనువదించిన వేటూరికి “భరిస్తాం స్మరిస్తాం” అంటూ ఆయన ఈ పాటలోనే రాసిన వాక్యాన్ని అర్పించుకుంటూ నమస్సులు తెల్పుకుంటున్నాను!

You May Also Like

26 thoughts on “దేహం తిరి!

 1. baagundi nee vyakhyanam sodara. chakkani paatani artham chesukoleka chetta anukune janalaku ilaanti analysis chadavavalasina avasaram entaina undi.

 2. nijamgaa manaspoortigaa cheppaalanTE ee paaTalO Veturi antaTi arthaanni nimpaarani nEnu anukOlEnu. okasaari nuvvu vraasina vykhyaanam nuvvE chaduvukO, tammuDU… prati maaTakii “ilaa artham teesukOvaali ikkaDa”, “deeniki ilaa vaaDaaru” annaTTugaa vyaakhyaanaalu cheppukunE kaaDiki mottamU paiSaachika bhaashalO vraasukOvacchu paaTa – “kraakarban kraakarban kraakarbikkara kraakarban…” anTU vraasi “kraakarban anTE oka chOTa manasu, inkO chOTa prEma …” anukunTU adbhutamaina arthaalu cheppukOvacchu.

  naarikELa paakam kooDaa kaadu idi… paitya prakOpamEnanTaanu nEnaitE. aa ubhayabhaashaa panDituDu vraasina ennO chetta paaTallO idii okaTigaanE ippaTikii naa abhipraayam… kaakapOtE nee vyaakhyaanamlO aa paityamlO kooDaa rasapaakaanni chooDagalagaTam maatram neelOni kaviki nidarSanam. aTu paaTaa kaaka, iTu kavitaa kaaka renDiTikii madhyasthamgaanO madhya rakamgaanO …arava exhibition-lO tappipOyina telugu pillaaDilaa undi ee paaTa overall-gaa. nee vyaakhyaanam aa pillaaDi gurinchi telugulO announcement icchinaTTundi… kaneesam aa pillaaDi taalooku vaaLLakainaa arthamavutundi. kaanee …aa pillaaDu maa family kaadu. 😛

  1. Lot of smiles for your description! తప్పిపోయిన అబ్బాయ్- Good example!

   ఈ పాటకి వేటూరి పూర్తి న్యాయం చెయ్యలేదని ఒప్పుకుంటాను. అయితే ఇది చెత్త పాట అనను. ఈ పాటకి చక్కటి భావం ఉందని తమిళ పాట సాహిత్యం చూస్తే అర్థమౌతుంది. కాబట్టి అర్థం లేదు, మనమే ఊహించుకున్నాం అన్నది సబబు కాకపోవచ్చు. అయితే వైరముత్తు చెప్పినంత స్పష్టంగా, వేటూరి చెప్పలేకపోయి ఉండొచ్చు. ఈ విషయంలో వేటూరిని మనం తప్పుపట్టొచ్చు.

   ఈ పాట గురించి రాయడంలో నా ఉద్దేశ్యం వేటూరిని పొగడ్డం కాదు. పాట సారాన్ని అందించాలని. కాబట్టి వేటూరిని పక్కన పెట్టేసి ఈ పాటని వినడంలో తప్పులేదనుకుంటాను.

   1. “kaakapOtE nee vyaakhyaanamlO aa paityamlO kooDaa rasapaakaanni chooDagalagaTam maatram neelOni kaviki nidarSanam. ”

    Adhyakshaaa…nenu koodaa ilaage chala chala vrayalani aavesa padipoyanu …kani manakantha bhavam ledu ani drop ayyanu …

    kaabatti adhyakshaaa…meeru vrase prati interpretation lonu meeloni kavini (love song)/ bhavakudu (other songs)matrame choodatam , mariyu bhavam vadileyadam correctemo anipistundi

    ( line line ki differ avvatam annitiki bagodu kadaa…)

    pls chk this in your next attempts…

   2. జీవం నది యద నీరధి, నెనరే

    ee bhavalu interpret chese athani knowledge ni batti maaruthayi …veturi kontha bhasha ekkuvaga telisina varu ( anduke aayana klishtamaina padalatho vrayagalaru) …aayana pataku nyayam chesi manamu telisikogalam ani gurantee ledu …ade simple words ayithe ardham idi ani cheppadaniki chance yekkuva.

    for example:

    sirivennela song , ‘lalitha layajanitha’ ani oka line raaste …aa simple line ki chala time pattindi naaku …akkada group lo medhavulu unnaru kani , varevvaru cheppaledu …alaa anai naa swantha ga okka song ki kooda cheppalenu. as it is not my interest.

 3. too good explanation.. i some how liked this song very much though i couldnt understand few parts of this song .. thnx for sharing 🙂

 4. ెెఎప్పటిలానే ఈ పాటను కూడా బాగా విడమరిచారు కృతజ్ఞతలు, నేను చాలా రోజుల నుండి ఛత్రపతిలోని పాట(అగ్నిస్ఖలన) అర్థం ఏమిటో తెలియక తికమక పడుతున్నాను, కొంచెం మీకు తెలిస్తే రాసి పెడుదురు.
  ముందస్తు కృతజ్ఞతలు.

  1. మీకు నచ్చినందుకు సంతోషం! ఇక “అగ్నిస్ఖలన” అంటారా, అది విశ్లేషించాలి అంటే బాగా సంస్కృతం తెలిసి ఉండాలి. నాకా సామర్ధ్యం లేదు కనుక ఎవరైనా చేస్తారేమో అని నేనూ వేచి చూస్తున్నాను

 5. నేను మీ వ్యాఖ్యానం చూడకమునుపు ఇదేం పాట రా బాబు. ఇంత మంచి మ్యూజిక్ కి ఇలా రాయిస్తారెంటి అనుకునేవాడిని. ఇప్పుడు పాట వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా అర్థం బానే ఉందనిపిన్స్తోంది.
  Thanks for educating me.

 6. ఈ టపా చూసాకా మీరు సఖి లో కొన్ని పాటలకి కూడా అర్థం చెప్పగలరనిపించింది. మీకు వీటి మీద రాసే ఉద్దేశం ఎమన్నా ఉందా?
  – సెప్టెంబర్ మాసం, స్నేహితుడా (లో పల్లవికి ముందు వచ్చే లైన్స్)

  1. అవును. కొంత ఎబ్బెట్టుగా ఉన్న మాట నిజమే. వేటూరి చాలా dubbing పాటల్లో ఈ ఇబ్బంది ఉంది. సఖి పాటలు నాకూ పూర్తిగా అర్థం కాలేదు కానీ, స్నేహితుడా పాట గురించి అప్పుడెప్పుడో orkut group లో రాసిన గుర్తు. అది వెతికి ఈ blog లో పెట్టడానికి ప్రయత్నిస్తాను.

 7. చాలా మంచి వివరణ. ధన్యవాదాలు.
  ఏంతైనా వేటురిగారు కదా 🙂

 8. వేటూరి కదా అని సరిపెట్టుకోవాలి అనుకోండి. ఇంకేం చేస్తాం! వేటూరి అన్ని పాటలకీ ఈ అర్థంకాకపోవడం సమస్య లేదు. కొన్నిటికే ఉంది. ఈ ఇబ్బంది మనని పెట్టకుండా ఆయన రాస్తే బాగుణ్ణు. లేక ఆయన స్థాయికి మనం ఎదగాలని కోరుకోవాలేమో!

 9. వేటూరి గారొక్కరే కాదు, సీతారామశాస్త్రీ గారి పాటలలో కూడా కొన్ని(నాకైతే చాలానే) అర్థం కాని పదాలుంటాయి.

  1. నిజమే. అయితే సిరివెన్నెలతో పోలిస్తే వేటూరి కాస్త క్లిష్టమైన భాష వాడతారు. పైగా వేటూరి భావాల్లో కూడా క్లిష్టత ఎక్కువ. అందుకే ఈయన పాటలు కొన్ని సరిగ్గా అర్థం కావు.

 10. @ Phani – excellent job. Really well done. BTW, any chance of getting audio links for telugu and/or Tamil version.

  @కన్నగాడు .. కవిత్వమన్నాక అన్నీ అరిటిపండొలిచి నోట్లో పెట్టినట్టు ఉండాలంటే కుదరదు. అప్పుడప్పుడూ నారిఖేళపాకం కూడా ఎదురైనప్పుడే మన రసగ్రహణ శక్తీ పెరుగుతుంది. అర్ధం కాని మాటలెదురైతే, దాని అర్ధమేవిటో శోధీంచి సాధించండి. మీ ఎంజాయిమెంటు ఒక పది రెట్లు పెరుగుతుంది – గేరంటీ!

  Someone wanted explanation of Sakhi songs. Which one?
  You may want to check this out for అలై పొంగెరా

  @ NaChaKi .. ఇంతమాత్రానికి వేటూరి పాటనెందుకు తిట్టడం? తమిళ డబ్బింగుల్తప్ప దిక్కులేని తెలుగు సినిమా భావదారిద్ర్యాన్ని నిందించండి. ఐనా మీ గురువుగారు తన ఒకానొక పాటకి చేసిన అరగంట వ్యాఖ్యానం కంటే ఘోరంగా ఏం లేవు ఈ పాటా, దానికి ఫణిగారి వ్యాఖ్యాను.

  1. స్వామీ, కొత్తపాళీ, ఎవరో గురువుగారి పాటంత ఘోరంగాలేవు అంటే మీ ఉద్దేశ్యం – కొంచెం ఘోరంగా ఉన్నాయనా? 🙂 ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్షా!!! పాట వ్యాఖ్యానం చాలా బాగుంది. బాగున్న వాటితో పోల్చక, అంత ఘోరం కాదు, ఇంత ఘోరం కాదు అనడం… మీరసలు పొగుడుతున్నారా లేక తిడుతున్నారా? 🙂
   ఆజ్ఞాపించి మరీ పాటకి వ్యాఖ్యానం వ్రాయించి, ఇప్పుడు ఆ లంకెను ప్రచారం చెయ్యకపోవడం భావ్యమా? సరి, సరి, నా గీతను నేనే వ్రాసుకునెదను గాక… సభాజనులారా… అలై పొంగెరా పాటకు నా వ్యాఖ్యానమును చదివిపెట్టండి…http://uniqcyberzone.com/svennela/?p=22

   ఫణీంద్రగారూ, మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. పాటని ఇక్కడ చదవటమే గానీ ఇంకా వినలేదు. అందుకని అభిప్రాయాలు వ్యక్తపరచడం అంత బాగోదేమో…అయినా… నా రెండు చిన్న ముక్కలు ఏమిటంటే… మరీ కాంక్ష,చెలిమి,నెనరు అన్న పదాల్ని ప్రేమతో సమానం చేసేయడం అంత బాలేదేమో… అవన్నీ వేరే వేరే పదాలు… పదార్థాలూ… వాటిని వేటూరి వారు ఒకే అర్థంలో వాడేసారంటే కొంచెం ఇబ్బందిగా ఉంది.

   1. కృష్ణ మోహన్ గారూ,

    మీ కామెంట్లకు thanks. కొత్తపాళీ గారిని మీరు ప్రశ్నించినవి సబబుగానే ఉన్నాయ్. ఆయన జవాబులకై ఎదురుచూస్తాను.

    ఇక తమిళ పాటలో ప్రేమ గురించి మాత్రమే ఉండడంతో తెలుగులో కాంక్ష,చెలిమి,నెనరు ఒకటే అనుకోవాల్సి వచ్చింది. అది అంత పొసగలేదు అని నేనూ ఒప్పుకుంటాను.

 11. @Mauli

  అధ్యక్షా,

  మీరు తిడుతున్నారో పొగుడుతున్నారో తెలియకుండా ఇలా రాస్తే ఎలా అధ్యక్షా? నా మనసుకి తోచినది నేను రాశానే తప్ప పాటలో లేని భావాన్ని చూపించాలనే కుట్ర ఏమీ లేదు అధ్యక్షా! అది మీకు కిట్టించిన భావంలా అనిపిస్తే నేనేం చెయ్యను అధ్యక్షా? నా చేత్తో రాయగలను కానీ, నా కళ్ళతో మీకు చూపించలేనుగా అధ్యక్షా! అయినా తమిళంలో ఇదొక గొప్ప కవితనీ, కాబట్టి తెలుగులో కొద్దో గొప్పో భావం ఉండేలానే రాస్తారని, ఒకవేళ మనకి అలా అనిపించకపోతే అది తెలుగు అనువాదం చేసిన కవి సామర్థ్యలోపమే కానీ అసలు భావమే లేకపోవడం కాదనీ, నేను భావిస్తే తప్పా అధ్యక్షా?

  1. adi tamilamlo goppa kavitha ani, leka veturi, sirivennela goppa kavulu ani translate cheste …meeru cheppe bhaavam lo meeloni bhavakudu (valla bhavalu ohhinche) kanipistadu kani …visleshakudu miss avuthadu ….

   nenu Veturi ee song chetta ani assalu cheppanu ..tappakunda baga vrasi untaru …bhavam undi untundi …adi ardham kanappudu manaku ilaa ayyi undochu ani bhaavam ani vrastamu …akkade vachindi chikku.

   ex: ” జీవితమనే నదికి పరమార్థమైన సాగరం ప్రేమ” annaru, translate chesaka kooda ardham kaledu.

   naaku ee sentence ardhavantham ga anipinchaledu …so pAta lo leni bhavam goppaga choopincharu analedu …unna bhavame disclose avvaledu inka ani naa bhavam.

   1. inka tamila kavi vrasina kavitha ni maniratnam vaadukonnadiu ani ardham ayyindi …yedo language loni kavithani choosi telugu lo ade music ki, bhavam ki vrayali ante ..yenduku ..ani veturi kooda sontha kavithvam vrase chances unnayi …

    musugu lo guddulaata ante ide ..naaku tamil meaning telidu, telugu meaning telidu …

    పుటకే పాపం కడుగు అమృతం చెలిమే

    ante meeru మనకి పుట్టకనుంచీ ఉన్న కల్మషాలని కడిగే అమృతం ప్రేమ annaru…

    appudu aa line

    putaka papam kadugu amrutham chelimE ani undali kaani …

    పుటకే పాపం kaadu …so yedo okati sari cheyyali…

 12. @Mauli

  “ఉన్న భావం డిస్క్లోస్ కాలేదు” – అన్నారు. నాకూ ఇదే సమస్య వచ్చింది. ఈ పాట అర్థం కాలేదు. అప్పుడు తమిళంలో పాట translation చదివాను. గొప్పగా అనిపించింది (నా వ్యాసంలో ఆ తమిళ పాట translation link ఉంది, చూడండి.) దానిని ఆధారం చేసుకుని తెలుగుని అర్థం చేసుకోవల్సి వచ్చింది. అంటే వేటూరి ఈ పాట విషయంలో fail అయ్యినట్టు ఒప్పుకు తీరాలి. ఈ విషయమే వ్యాసంలో కూడా చెప్పాను. అయితే తమిళ భావం గొప్పది కాబట్టి అది అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో వ్యాసం రాశాను తప్ప వేటూరి పై అభిమానంతో కాదు.

  మీరు అడిగిన ప్రశ్నలు –

  1. జీవం నది – నదులు సముద్రంలో కలుస్తాయ్. సముద్రం గమ్యం అనుకోవచ్చు. జీవితమే నది అనుకుంటే, మరి జీవితానికి గమ్యం ఏంటి? అది ప్రేమ.

  2. పుటకే పాపం – మీరన్నది నిజమే! grammatical గా ఆ అర్థం సరిపోదు. అందుకే ఇంకో అర్థం కూడా చెప్పాను కదా!

 13. 2.జీవితమనే నదికి పరమార్థమైన సాగరం ప్రేమ – ki total ga oka meaning raadu ..you need to split it but with this sentence we couldn’t split it and get actual meaning..

  now i found the expected split in tamil song link u provided.

  tamil:”My heart,Life is a river whilst love is the ocean”

  నెనరే = my heart,

  jeevam nadi = life is a river

  whilst ( correct split would give this feel)

  yeda neeradhi = love is the ocean

  దేహం తిరి వెలుగన్నది, చెలిమే /దేహం తిరి, వెలుగన్నది చెలిమే

  O love,The body is the wick and love is the flame,”

  దేహం తిరి =The body is the wick

  and

  వెలుగన్నది చెలిమే =love is the flame

  its better if we know meaning of each tamil word he used separately …instead of assuming/ picking some words in the given english translation …

  for example :

  చెలిమే, నెనరే lanu meeru correct place lo use cheyyaledu so , meaning disturb ayyindi …

  for me for the first 2 lines veturi tried best or did very well…to know other lines should sit with a tamil guy and match telugu meaning with the given english translation ..!

  then Kiran and all could appreciate Veturi’s work 🙂

  Thanks for introducing the good song, and your efforts to write the lyrics from audio is great..( though I am not sure they are 100% correct, i couldn’t make even 10% of it)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.