బాలసుబ్రహ్మణ్యం గారు మొదటిసారి సంగీత దర్శకత్వం వహించిన “కన్య కుమారి” చిత్రంలోని ఒక చక్కని మెలోడి మీకోసం. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో దాసరి గారు మాట్లాడుతూ,వేటూరి గారు ఎంతో అభిమానించి రాసుకున్న ఈ సాహిత్యాన్ని ఒక దర్శకుడు తిరస్కరించారని బాధపడుతుంటే తాను ఈ సినిమాలో సంధర్బానుసారంగా ఉపయోగించుకున్నాను అని చెప్పారు. ఈ పాట వీడియో దొరకలేదు ఆడియో ఈ కింది ఎంబెడెడ్ విడ్జెట్ లో వినవచ్చు.
చిత్రం : కన్య కుమారి(1977)
సంగీతం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు
తెలియదు నాకు పడమర తూరుపు
తెలిసిందొకటే ఎరుపు నా చెలియ పెదవి ఎరుపు
తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు
ఇరుసంజెల పిలుపుల నడుమ
మరుమల్లెల వలపే మనది
ఇరు పెదవుల ఎరుపుల నడుమ
చిరునవ్వుల పిలుపే మనది
తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు
సిరివెన్నెలొలుకు సిగమల్లె తెలుపు
చిరునవ్వులోని మరుమల్లె తెలుపు
తొలిరోజులందు చెలిమోజులందు
విరజాజులన్ని తెలుపు
అరమూత కనుల నును లేత వలపు
తెర తీసి నాకు పిలుపు
తెలిగించి మనసు తెలుపు
తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు
చెలి కాటుక మబ్బుల వెన్నెల
తొలి కోరిక మదిలో కోయిల
మన కలయిక సంధ్యారాగం
ప్రతి రాగం జీవన రాగం
తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు
తెలియదు నాకు పడమర తూరుపు
తెలిసిందొకటే ఎరుపు నా చెలియ పెదవి ఎరుపు
తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు
————————————