సాగరసంగమం – (ఓం నమశివాయ)

చిత్రం: సాగర సంగమం
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.జానకి

————-

ఓం..ఓం..ఓం..
ఓం నమశివాయ ఓం నమశివాయ
చంద్ర కళాధర సహృదయా…చంద్ర కళాధరసహృదయా
సాంద్రకళా పూర్ణోదయలయనిలయా.

ఓం నమశివాయ|| పంచ భూతములుముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులేస్వరసప్తకమై
సా.గా.మ.దనిస.. దగమద..ని సా స స స స
గగగ..ససస నిగ మదసని..దమగస
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారాఆఆ
నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయా!!!

ఓం నమశివాయ||
త్రికాలములు నీనేత్ర త్రయమై
చతుర్వేదములు ప్రాహారములై
త్రికాలములు నీనేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాహారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు

నీసంకల్పానికి ఋత్విజవరులై

అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాసగిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా

ఓం నమశివాయ||

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.