నవ్వులో జివ్వున పూలబాణాలు సంధించు పొద్దుకాడ (అవినేని భాస్కర్ )

veturi2

“ప్రేమా, గాలీ ఎక్కువగా కాలుష్యమవ్వకుండ ఉన్నది పల్లెటూళ్ళలోనే” అన్నాడు అరవ కవి వైరముత్తు. సినిమా పాటల్లో అత్యధికం ప్రేమ పాటలే. సినిమా పాట కథనీ, సన్నివేశాన్నీ, పాత్రల్నీ, వారి పరిజ్ఞానాన్నీ అనుసరించి రాయబడే రోజులు పోయి, “ఇదీ ట్యూన్. ఒక డూయట్ రాసివ్వండి” అని అడిగే రోజుల్లో పాటలు రాయడానికి రంగప్రవేశం చేశాడు వేటూరి.

ప్రతిభ వున్న కవి సన్నివేశమేలేని డూయట్లకి కూడా తనదైన శైలిలో కవిత్వం చిలకరించి పోతాడు. కవి తను చేయదలచుకున్న పద ప్రయోగాలకీ, చమత్కారాలకీ ఇలాంటప్పుడు ఇంకాస్త స్వేఛ్చ ఉంటుందేమో. ఈ పాట తీరు చూస్తే అలానే అనిపిస్తుంది.

పల్లెటూరి ప్రేమికులు పాడే డూయట్ ఇది! పాటలో ఇదే చెప్పాలి అన్న నిబంధనలేమీ పెట్టలేదేమో డైరెక్టర్. సరదా ప్రేమికుల సరసాన్ని చిలిపి భావాలతో నింపేశాడు వేటూరి. పల్లెటూరి వాతావరణానికి రాయాలంటే ఎన్ని రకాల థీమ్స్ ఉన్నాయో, ఎన్ని ఉపమానాలు దొరుకుతాయో. ఒక confined theme అంటూ ఎంచుకోకుండ, విశాలమైన “పల్లెటూరి ప్రేమ”ని ఎంచుకుని ఎన్నో విషయాలను వాళ్ళ పరిదిలోని ఉపమానాలతో, వాళ్ళ పరిజ్ఞానానానికి లోబడిన పోలికలతో, పల్లెటూరి భాషలోని తేలికైన పదాలతో రాసేశాడు.

గంగరావి చెట్టు, సంత, బంగరాలాట, సన్నజాజి పూలు, మీసకట్టు, నూనెదీపం, ఆకూ-వక్క, కొండలు, మట్టిగాజులు, మల్లె తోటలు, కంచెలు, కంతిరీగలు లాంటి పల్లెటూరి తెలుగు పదాలతో ఎంత చిలిపిగా ఉందో.

“భామామణి, చింతామణి, దీపము, సందే (సంధ్యకి వికృతి), బాణము, సంధించు” – ఈ ఆరు అన్య భాషా పదాలు మినహాయించితే పాటంతా తెలుగుపదాలతోనే రాశాడు కవి. మామూలుగా జానపదాల్లో శృంగార రసం ఎక్కువగా ఉంటుంది. ఈ పాటకూడా పల్లెటూరి వాతావరణానికి రాయడంవల్లేమో సరస, శృంగార భావాలు కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నాయి. కానీ పదాలూ ఎక్కడా హద్దులు దాటిందన్న భావన కలిగించదు. వినడానికి ఇంపుగా ఉంటుంది.

“సాలూరి వారి సంగీతంలో రసాలూరుతూనే వుంటాయి” అన్నది సినిమా నానుడి. ఆ నానుడికి తగ్గట్టే ఉంది సాలూరి వంశీయుడు కోటి సంగీతం సమకూర్చిన ఈ పాట!

గాయకులు : బాలు, చిత్ర

సంగీతం : కోటి

చిత్రం : దొంగల్లుడు

==============
పల్లవి

అతడు :
గంగరావి చెట్టుకాడ ఉంగరాల జుట్టుదాని
గురుడా ఓరి నరుడా గుచ్చి గుబులేచూడరో
(గంగరావి చెట్లు గుళ్ళల్లో, ఊరి మొగదలలో , ఏటిగట్లపైనా ఎక్కువగా ఉంటాయి. ఆకులు దట్టంగా, పెద్దవిగా ఉండేందువల్ల చెట్టుకింద  నీడగా, చల్లగా ఉంటుంది. ప్రేమికులంటే పొన్న చెట్టుకాడనే కలుసుకోవాలని లేదుగా? గంగరావి చెట్టుకి కూడా పొన్న చెట్టంత హోదా కల్పించాడు కవి.)

ఆమె :
టంగుటూరి సంతకాడ బొంగగరాల ఆటకాడ
మరిదా, బావమరిదా కాస్త సరదా చెయ్యరో
మడిగట్టుకుని ఉండనక్కర్లేదు; సరదాగా చిలిపియల్లర్లు చేసినా పరవాలేదని బావని కవ్విస్తుంది ఈ మరదలు. (“ఉంగరాల, బొంగరాల” – ప్రాసలెంత ఒద్దికగా అమర్చాడో!)

అతడు : నీ మొగ్గకి బుగ్గంటినా
ఆమె : నా సిగ్గుకి అగ్గంటునా
అతడు : నాగోలకి హద్దుండదు
ఆమె : నీ కౌగిట గాలాడదు

రెచ్చగొట్టమాకు మరదలా? నేను ముద్దుపెడితే నువ్వు ఆగలేవు అని వార్నింగ్ ఇస్తున్నాడు బావ. మరదలేమో గడుసమ్మాయి. నీ ముద్దులుకి నా సిగ్గుపొరకూడా కరగదని ఉడికిస్తుంది! నేను అల్లరి మొదలుపెడితే తట్టుకోలేవు అని మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. నిజమే బావా, నువ్వు రెచ్చిపోయి కౌగిలించుకుంటే నాకు అసలు గాలైనా ఆడదు అని పాత కౌగిలింతని గుర్తు తెచ్చుకుంటుంది మరదలు.

అతడు :
సందుజూసి అందమంతా అప్పగిస్తే
సన్నజాజి పూల తేనె సప్పరిస్తా

ఆమె :
అందుకొచ్చి ఆరుబయట ఆవులిస్తే
దాచుకున్న పండు నీకు ధానమిస్తా

ఏముందీ? అనువైన చోటూ, సమయమూ దొరికనీ అప్పుడు చూపిస్తాను నేనేంటో అంటున్నాడు బావ. సమయం రాదు, చోటు దొరకదు. మనమే కుదుర్చుకోవాలి. నీకు వీలున్నప్పుడు వచ్చి ఆవులింతతో నాకొక సిగ్నల్ ఇవ్వు గంగరావి చెట్టుకాడికి వచ్చేస్తాను అంటుంది మరదలు. అమ్మాయిని సన్నజాజి తీగతో పోల్చడం, చప్పరిస్తా అన్న పదాన్ని “సప్పరిస్తా” అని పల్లెటూరి యాసలో వాడటం, ఆవులింతని కూడా పాటలో వాడటం కవి చమత్కారం అనే చెప్పాలి!
చరణం 1
అతడు : ఎర్రగా బుర్రగా బంతిపువ్వల్లే ఉన్నావే భామామణీ

బంతి పువ్వులా అందంగా సుకుమారంగా ఉన్నావు మరదలా అని పొగుడుతున్నాడు

ఆమె : చుర్రుగా చూడగా చిర్రుపుట్టాక నా పేరు చింతామణీ
పైకి సుకుమారంగా సాధుప్రాణిలా కనిపిస్తానుగానీ, నాకుగానీ కోపం తెప్పించావో నాలోని చింతామణిని చూస్తావు జాగ్రత్త!

అతడు : కోపమొచ్చి కొత్త ఈడు కోసుకున్నా ఉన్న కోరికంతా తీరకుండ ఊరుకోను
అవన్నీ నాకు తెలియవు, నన్ను రెచ్చగొట్టావో నాలోని తాపమంతా తీరేదాక వదిలిపెట్టను అంటున్నాడు బావ

ఆమె : గుత్తమైన మీసకట్టు గుచ్చుకున్నా నేను మెత్తనైన ముద్దులేక మేలుకోను

బిగువైన ఆ మీసకట్టు గుచ్చుకునేలా మొరటుగానే కాదు, మెత్తగా కూడా ముద్దు పెట్టాలి; అప్పుడుగానీ నా మనసు పులకించదు అని సున్నితత్వంకూడా నేర్పుతుంది బావకి!

అతడు : చీకుచింత పక్కనెట్టి చిన్నదానా చీకటింట దీపమల్లే చూసుకోనా
ఆ.. తెలుసులే! మొరటోణ్ణీ కావచ్చుగానీ, మూర్ఖుణ్ణయితే కాను నాక్కూడా పట్టువిడుపులు తెలుసులే అని హామీ ఇస్తున్నాడు. (ఆ ఉపమానం చూడండి. చీకట్లో వెలిగించుకున్న దీపం గాలికి ఆరిపోకుండ కాపాడుకున్నంత శ్రద్దగా, జాగ్రత్తగా కాపాడుకుంటాడట!! వావ్ వేటూరీ!!!)

ఆమె : ఆకువక్క చేతికిచ్చి అందగాడా సోకుమొక్కు సందెకాడ తీర్చుకోనా
నువ్వంత ప్రేమగా చూసుకుంటానంటే నాకింకేంకావాలి? నా సర్వం నీకిచ్చేస్తాను అని పొంగిపోతుంది మరదలు.(దేవుడికి ఆకువక్క పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నంత భక్తి శ్రద్ధలతో సందెవేళలో తాంబూలం అందించి సోకుమొక్కు తీస్చుకుంటుందట! పదాలెంత చమత్కారంగా వాడాడో కవి!)

చరణం 2
ఆమె : ముద్దులో కొత్తగా పోటు మద్దెళ్ళు మోగించి పోరగాడా
సున్నితంగా ముద్దెట్టుకోమన్నానుకదా అని చప్పుడులేని ఆ చప్పిడి ముద్దేనా ఎప్పుడూ? ఘాటుముద్దుల మద్దెలు మోగించు పిల్లాడా అని గారాలుపోతుంది.

అతడు : నవ్వులో జివ్వున పూలబాణాలు సంధించు పొద్దుకాడ

ముసిముసిగానే కాదు, మాణిక్యాలు రాలినట్టు గలగలమని నవ్వి నామీద నీ నవ్వుల పూలని బాణాల్లా సంధించి నన్ను కవ్విస్తూ ఉండు అంటున్నాడా ‘బాలు’డు. (“జివ్వు” అన్న అచ్చ తెలుగు పదం నాకు చాలా ఇష్టం).

ఆమె : పక్కమీద పాలపొంగులారకుండ తూర్పు కొండదల్లి ఎండబొట్టు పెట్టుకోదు
పక్క మీద మురిపాల పొంగులు ఆరకుండా తూర్పు తెల్లారదట! (సరససల్లాపాలు తెల్లవారేదాక సాగాలి అన్న ఆమె కోరికని కవి ఎంత భావుకతతో పలికించాడో కవి! తెల్లవారడాన్ని “తూర్పుకొండతల్లి ఎండబొట్టుపెట్టుకుంటుంది” అన్న ఉపమానంలోనే ఉంది కవి ప్రతిభంతా! పాలపొంగులారాకుండ అన్న భావంలో శృంగారం మోతాదు ఎక్కువయినా చెప్పిన తీరు రసజ్ఞులచేత శభాష్ కొట్టిస్తుంది!)

అతడు :
చేతికున్న మట్టిగాజు చిట్లకుండ చాటు పుట్టుమచ్చ దోపిడింక పూర్తికాదు

మట్టిగాజుల అందమూ, అవి చిట్లడమూ! ఎంత నాటు సరసమో! సరసంలోని తీయదనమంతా ఒక లైన్ లో చెప్పేశాడు కవి.
(సరసాలాటలో మట్టిగాజులు చిట్లడం, గాజులకి మరణం కాదు జన్మ సాపల్యం అని నేను రాసుకున్నానెప్పుడో!)

ఆమె :
మల్లిజాజి తోటకాడ పిల్లగాడా మంచి చెడ్డ చూసిపెట్టు కంచెలాగా
(జాజిమల్లి అనడం రొటీన్; “మల్లిజాజి” అని తిరగేసి రాయడం వేటూరిలోని ప్రయోగకుడి పనేమో అనిపిస్తుంది. లేదంటే తర్వాత లైన్ లోని మొదటి పదానికి ప్రాసగా ఉంటుందని చేశాడేమో! ఈ మల్లిజాజి పదప్రయోగం వేటూరి పాటల్లో మాత్రమే విన్నాను; ఆ పాటలు – “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”, “ఓసి మనసా నీకు తెలుసా”. )

అతడు :
గిల్లి జోల పాడమాకు పిల్లదానా వాలకుండ ఊరుకోదు కంతిరీగ

(“గిల్లి జోలపాడటం” అన్న జాతీయాన్ని వాడుకున్నాడు కవి)

=============================

3 thoughts on “నవ్వులో జివ్వున పూలబాణాలు సంధించు పొద్దుకాడ (అవినేని భాస్కర్ )”

  1. manchi vishleshana andinchaaru Bhasker garu ….
    సాహిత్యం
    July 25, 2014
    నవ్వులో జివ్వున పూలబాణాలు సంధించు పొద్దుకాడ (అవినేని భాస్కర్ )
    Posted By: శ్రీనివాస్ పప్పు 0 Comment
    veturi2

    “ప్రేమా, గాలీ ఎక్కువగా కాలుష్యమవ్వకుండ ఉన్నది పల్లెటూళ్ళలోనే” అన్నాడు అరవ కవి వైరముత్తు. సినిమా పాటల్లో అత్యధికం ప్రేమ పాటలే. సినిమా పాట కథనీ, సన్నివేశాన్నీ, పాత్రల్నీ, వారి పరిజ్ఞానాన్నీ అనుసరించి రాయబడే రోజులు పోయి, “ఇదీ ట్యూన్. ఒక డూయట్ రాసివ్వండి” అని అడిగే రోజుల్లో పాటలు రాయడానికి రంగప్రవేశం చేశాడు వేటూరి.

    ప్రతిభ వున్న కవి సన్నివేశమేలేని డూయట్లకి కూడా తనదైన శైలిలో కవిత్వం చిలకరించి పోతాడు. కవి తను చేయదలచుకున్న పద ప్రయోగాలకీ, చమత్కారాలకీ ఇలాంటప్పుడు ఇంకాస్త స్వేఛ్చ ఉంటుందేమో. ఈ పాట తీరు చూస్తే అలానే అనిపిస్తుంది.

    పల్లెటూరి ప్రేమికులు పాడే డూయట్ ఇది! పాటలో ఇదే చెప్పాలి అన్న నిబంధనలేమీ పెట్టలేదేమో డైరెక్టర్. సరదా ప్రేమికుల సరసాన్ని చిలిపి భావాలతో నింపేశాడు వేటూరి. పల్లెటూరి వాతావరణానికి రాయాలంటే ఎన్ని రకాల థీమ్స్ ఉన్నాయో, ఎన్ని ఉపమానాలు దొరుకుతాయో. ఒక confined theme అంటూ ఎంచుకోకుండ, విశాలమైన “పల్లెటూరి ప్రేమ”ని ఎంచుకుని ఎన్నో విషయాలను వాళ్ళ పరిదిలోని ఉపమానాలతో, వాళ్ళ పరిజ్ఞానానానికి లోబడిన పోలికలతో, పల్లెటూరి భాషలోని తేలికైన పదాలతో రాసేశాడు.

    గంగరావి చెట్టు, సంత, బంగరాలాట, సన్నజాజి పూలు, మీసకట్టు, నూనెదీపం, ఆకూ-వక్క, కొండలు, మట్టిగాజులు, మల్లె తోటలు, కంచెలు, కంతిరీగలు లాంటి పల్లెటూరి తెలుగు పదాలతో ఎంత చిలిపిగా ఉందో.

    “భామామణి, చింతామణి, దీపము, సందే (సంధ్యకి వికృతి), బాణము, సంధించు” – ఈ ఆరు అన్య భాషా పదాలు మినహాయించితే పాటంతా తెలుగుపదాలతోనే రాశాడు కవి. మామూలుగా జానపదాల్లో శృంగార రసం ఎక్కువగా ఉంటుంది. ఈ పాటకూడా పల్లెటూరి వాతావరణానికి రాయడంవల్లేమో సరస, శృంగార భావాలు కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నాయి. కానీ పదాలూ ఎక్కడా హద్దులు దాటిందన్న భావన కలిగించదు. వినడానికి ఇంపుగా ఉంటుంది.

    “సాలూరి వారి సంగీతంలో రసాలూరుతూనే వుంటాయి” అన్నది సినిమా నానుడి. ఆ నానుడికి తగ్గట్టే ఉంది సాలూరి వంశీయుడు కోటి సంగీతం సమకూర్చిన ఈ పాట!

    గాయకులు : బాలు, చిత్ర

    సంగీతం : కోటి

    చిత్రం : దొంగల్లుడు

    ==============
    పల్లవి

    అతడు :
    గంగరావి చెట్టుకాడ ఉంగరాల జుట్టుదాని
    గురుడా ఓరి నరుడా గుచ్చి గుబులేచూడరో
    (గంగరావి చెట్లు గుళ్ళల్లో, ఊరి మొగదలలో , ఏటిగట్లపైనా ఎక్కువగా ఉంటాయి. ఆకులు దట్టంగా, పెద్దవిగా ఉండేందువల్ల చెట్టుకింద నీడగా, చల్లగా ఉంటుంది. ప్రేమికులంటే పొన్న చెట్టుకాడనే కలుసుకోవాలని లేదుగా? గంగరావి చెట్టుకి కూడా పొన్న చెట్టంత హోదా ……..nijame kadaa …Veturi gari kalam lo Gangaraavi chettu janma dhanyam ayindi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top