“కవి దాశరధికి నవయువ
కవితాశరధికి నిత్యకళ్యాణమగున్
రవికుల దాశరధికివలె మా,
కవికుల దాశరధి పరిధి కడలు కొను నిలన్”
అని వేటూరి సుందర రామ మూర్తి దాశరధి పుట్టినరోజున పద్యం చెప్పగానే, అంతే అభిమానంతో
“ఎందరు లేరు మిత్రులెందరులేరట సాహితుల్ హితుల్
చందురువంటి చల్లనయ్య సాహితి సాహితి
గుత్తగొన్నవారెందరు అందరం దిగిచి ఈ కవి డెందము
హత్తుకున్న మా సుందర రామ మూర్తికి వసుంధరలో నుపమానమున్నదే”
అని అభిమాన ఆశ్శీ:పూర్వకముగా పద్యం చెప్పారట దాశరధి.