వేటూరి..నా ఆల్-టైం ఫేవరెట్ గీతరచయిత.
చిన్నపుడెపుడో సీతాకోక చిలుక పాటలు వింటుంటే..
హే చుక్కా నవ్వవే
నావకు చుక్కానవ్వవే..
……
చుక్కా నవ్వవే
వేగుల చుక్కానవ్వవే..
లాంటి పదకేళులు చూస్తే అబ్బురమనిపించేది!!!
తెలుగు సినిమా పాటల్లో “వేటూరి”కి ఒక విశిష్టమైన స్థానముంది. “ఆనంద్” సినిమా రిలీజ్ అయిన కొత్తలో శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ లో చెప్పేవాడు- “ముందు నేను ఈ సినిమా ని పాటల్లేకుండా ప్లాన్ చేసాను.కానీ వేటూరి గారితో ఒక సారి మాట్లాడాక నాకు పాటల ప్రాశస్త్యం తెలిసింది.వంద సీన్లలో చెప్పగల విషయాన్ని పాటల్లో ఒక్క ఎక్స్ ప్రెషన్ లో చెప్పొచ్చని తెలిసింది. అందువల్ల పాటలు జతచేసాం”. ఆనంద్ సినిమా లో వేటూరి చాలా మంచి పాటలు వ్రాశారు.
ఆ మధ్యెపుడో ఆనంద్ సినిమా డివిడి చూస్తున్నాను. క్రింద ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ తో. ఒక పాట వస్తోంది.
ఎదలో గానం ..
పెదవే మౌనం..
సెలవన్నాయి కలలు..
సెలయేరైన కనులలో..
మెరిసెనిలా శ్రీరంగకావేరి సారంగ వర్ణాలలో…..
పాటని బాగా ఆస్వాదిస్తూ చూస్తున్నాను. ఇటు పాట వస్తుంటే అటు అన్ని లైన్లకి క్రింద ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ లో వాటి అనువాదాలు వస్తున్నాయి. ఇంతలో ఒక విషయం నాకు గమ్మత్తుగా అనిపించింది. అదేంటంటే వేటూరి గారు “మెరిసెనిలా శ్రీరంగకావేరి సారంగ వర్ణాలలో” అని వ్రాస్తే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసిన వాళ్ళు “They glistered in colours” అని ఒక్క ముక్క లో వ్రాసేసారు. నిజానికి ఆ ఒక్క అంశం చాలా విషయాలు చెప్పింది- తెలుగుకే సొంతమై, ఇంగ్లీష్ లాంటి భాషల్లోకి అనువదించవీలు కాని తెనుగు సొగసు ని, అలాంటి సొగసైన పదాలతో “ఆనంద్” లాంటి కమర్షియల్ సినిమా పాటలకి సాహితీ గుబాళింపులద్దిన వేటూరి గొప్పదనాన్ని. నిజంగా వేటూరి గారు చాలా గ్రేట్ అనిపించింది.
అయితే (just for fun) ఇంతలోనే వచ్చిన ఒక చిలిపి ఆలోచన “పాపం వేటూరి!” అని నేను అనుకునేలా చేసింది. అదేంటంటే – పాపం వేటూరి గారు అంత కష్టపడి
“శ్రీ–రం–గ–కా–వే–రి–సా–రం–గ– వ–ర్ణా–ల–లో” అని వ్రాస్తే, వాడెవడో చా..లా…. సింపుల్ గా “colors” అని ఒక్క ముఖ్ఖ లో తేల్చేసాడుగా అని !!!!
—————————
మోహన్ రాజ్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్
మోహన్ రాజ్ గారి అసలు వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు