ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలి
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి
ఆరేసుకోవాలని ఆరేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి హరి హరి హరి హరి
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
నా పాటా ఈ పూటా నీ పైటలా
దాచేసుకోని తొలిపొంగులా
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
నా పాటా ఈ పూటా నీ పైటలా
దాచేసుకోని తొలిపొంగులా
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ నా చేతి చలి మంట కావాలి
నువ్వింకా కవ్వించకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాకా నా వలపు ఏరువాకా
నీ తాకా నీలిమబ్బు నా కోకా
నే రేగి పోవాలి
నే ఊగిపోవాలి
నే రేగి పోవాలి
నే ఊగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాటా కావాలి
ఆ పాటా పూబాటగా నిను చేరుకోవాలి