(మా వేటూరి Whatsapp group లో ఆయన పాటల్లో వినిపించే హీరో హీరోయిన్ల పేర్లు మీద జరిగిన చర్చని ఇక్కడ పొందుపరుస్తున్నాం)
మాధురి ఇంగువ:
ఏ హీరో హీరోయిన్ ల పేర్లైనా ఆయన పాటలో గువ్వలా ఒదిగిపోవలసిందే
నగుమోము నగ్మా
రాజహంసవో రాత్రి హింసవో రాచిలకా రావే నా రసరంభా రావే
నవ రంభల్లో యువ రాంబోతో జయహో
రస రమ్యకృష్ణుని రాధ
రాధా రాధా మదిలోన మన్మథ గాథ
ధనధాన్యేశ్వరి ఘన చీనాoబరి మా వాణీశ్వరి కృతి వినరా
నీ దివ్య భారాలు దిద్దుకుంటా
బోలో కృష్ణాముకుందా కిస్సే కిష్కింధ వేణువిలా వాయించరా
చిటికెడులే చిరు ముద్దుల్లో
యాయా సౌందర్య ఇది నిజమా మాయా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవే భామ
🙏🙏🙏 ఆమ్మో ఆ చిట్టా అనంతం
యశ్వంత్ ఆలూరు:
“రస రమ్యకృష్ణుడి రాధా” -> ఒకే లైనులో ఇద్దరూ కృష్ణ – రమ్యకృష్ణ
మరికొన్ని…
“రాధ లాగ మూగబోయా పొన్నచెట్టు నీడలో”
“సలలిత శృంగార సౌందర్య”
“చంటియారు నా ఎదరుంటే ఎంటియారులా అదిరింది” -> జూ. ఎన్టీఆర్
“మావిళ్ళకొస్తే ఓ ఆమని కౌగిళ్ళకిచ్చా నా ప్రేమని” -> దీని ముందు లైనులోనే “నా ఒంటి పేరే సౌందర్యము”
“బాలయ్యా కన్నె బెంగ తీరే దారేదయ్యా”
“అల్లు వారి పిల్లగాడా అల్లుకోరా గిల్లుకోరా”
బద్రి సినిమా లో,వేవేల మైనాల గానం పాటలో,విసిరిన యవ్వన “పవనా” ల అనీ రాశారు