నివాళించెద‌న్.. నివేదించెద‌న్ : క‌వీ..క‌వితా ప‌యోనిధీ…

ఫ‌స్ట్ కాజ్ : వేటూరి నిర్మిత పాట‌లీ పుత్ర న‌గ‌రిలో …

బాపూ ర‌మ‌ణ‌ల‌కు పాట రాయాలి..ప‌దాలు తెల్సుగా… అచ్చం ర‌వ‌ణుడిలానే ఉండాలి..చంద‌మామ కంచ‌మెట్టి స‌న్న‌జాబి బువ్వ‌పెట్టి అంటూ.. అందుకున్నాడు రాంబంటు కోసం అవ‌క‌త‌వ‌క‌డు అడ‌వి పురుషుడు/పంచదార చిల‌క‌డు/బు గ్గ‌పండు కొర‌క‌డు ఇలాంటివెన్నో ప‌దాల‌ను అల‌తి అల‌తి ప‌దాల‌ను కూర్చి సా హో అనిపించుకున్నాడు..అంద‌మంత నీదంటే అవ‌తారుడు..అదిరి..అదిరి ప‌డ‌ తాడు ముద‌రుబెండ‌డు అని ముక్తా యించాడు.

పాత్రికేయం చేసిన వాడికి పాట‌తో ప‌నేంటి.. లేదు పాటే అన్నం పెట్టాక పాత్రికే యంతో ఇక ప‌నేంటి. మెరీనా తీరం ఇచ్చిన ఆదేశం ఇదే అయి ఉంటుంది..నిజ‌ మే .. వాగ్దేవీ క‌రుణా విలాసం చెంత వాడొక తేజ‌స్సు.. ఒక‌ప‌రి యోగం ఒక ప‌రి స్నేహం వాడి చెంత‌నే సాధ్యం.. కార్తీకం/వైశాఖం ఏ మయినా ఆ వంశ‌ధార వ‌ య్యారాల చెంత వాగ్గేయాల చెంత మురిసిపోతాడు..హిమ‌వ‌త్ ప‌ర్వ‌త శిఖరం అంత ఎదిగిపోతాడు..మా సిక్కోలు నీ ళ్ల‌న్నా ఇష్ట‌మే..ఆ ప్రేమ పాట‌లో ఉంది.. ప‌ద‌భేరిలో ఉంది..అదీ వారి గొప్ప‌ద‌నం. న‌మామి వేటూరి స్మ‌రామి వేటూరి.. అవును ప్ర‌తిరోజూ విలు వైంది కాదా ప్ర‌య‌త్నిస్తే గెలుపేదో రాదా..చేద్దామంటూ చూద్దామంటే కాలం ఆగ‌దు.. అవును…నీ వ‌న్న‌ది మేం విన్న‌ది నిజం నిజం.. నీవు లేవ‌న్న‌దే అబ‌ద్ధం..అవున‌య్యా ఈ మ‌మ‌త‌ల‌న్నీ మౌన‌రాగం..వాంఛ‌ల‌ న్నీ వాయులీనం.. నీ స్మ‌ర‌ణే మాకు అంత్యంత ఆవ‌శ్య‌కం..

వేగంగా రాయ‌డం సినీ క‌వి ల‌క్ష‌ణం అయితే ఆ ల‌క్ష‌ణానికి అచ్చ‌మైన ప్ర‌తినిధి వేటూరి.. న‌మ్మిన మ‌ది మంత్రాల‌య‌మే.. న‌మ్మ‌ని వారికి ఇది తాప‌త్ర‌య‌మే… అబ్బా! కోటి రూపాయ‌ల పాట కోటి జేజేలు అందుకున్న పాట ఇలా ఏది రాసి నా ఆరేసుకోబోయి పారేసుకున్నాడు..హాహా కొమ్మ‌ను తాకి కోయిల‌కే ఆమ‌ని తెచ్చాడు.. ఆమె నీకై సాగి వ‌స్తే ప్రేమ రుతువు అన్నాడు.. అబ్బా!దండంరా తం డ్రి .. చుక్క‌ల‌డుగు దిక్కున‌డుగు చెమ్మ‌గిల్లిన చూపున‌డుగు నీరు పొంగిన క‌ను ల‌లో నీటి తెర‌లే అడ్డు నిలిచే అన‌డం వాడికొక్క‌డికే సాధ్యం.. గొప్ప‌వాడు..ఇక రాడు ఇల లేడు..

హార్మోనియం స్వ‌రాలు ప‌లుకుతున్నాయి.ప‌లికిన చోట ఇళ‌య రాజా..ప‌లికిం చిన చోట ఇళ‌య రాజా.. రాజాతో పాటు పాట‌ల రాజు కూడా.. మంచి పాటరా యు క‌వీ.. ఇది స్వ‌రం లేదు తాళం ఇస్తాను రాసేయ్ .. అంతే పాట సిద్ధం.. క్లా ప్స్..అదే కొట్టండి-తిట్టండి-గిల్లండి-గిచ్చండి-కోయండి-చంపండి పిచ్చండి న‌ మ్మండి ప్రేమా….స్వాతి చినుకులు సందేవేళ‌లు..గ‌స‌గ‌సాల కౌగిలింత‌లు అన్నీ అన్నీ వేటూరితోనే సాధ్యం..వాడికో మార్గం/వాడిదే ఈ మార్గం.. తెలుగు ప‌ద సీ మ‌ల్లో త‌ర‌గ‌ని గ‌ని రా వాడు..వంద‌నాలు చెల్లించు..

నేతాజీ పుట్టిన చోట

గీతాంజ‌లి పూసిన చోట

నువ్వూ అండ్ నేనూ

నేనూ అండ్ నా ప్రేమ

సాహిత్యం విక‌సిత వ‌నాల చెంత ప‌రీమ‌ళిస్తే అది వారికే చెల్లు..

సాహిత్యం ఉన్న‌త వ‌ర్ఛ‌స్సు కోరుకుంటే అది వారితోనే చెల్లు..

గోపెమ్మ గారూ మీ చేతి గోరు ముద్ద

రాధ‌మ్మ గారూ మీ చేతి వెన్నె ముద్ద

అన్నీ అన్నీ ఆ రాధేయుడికి అందించి

ఆ విందు ఈ విందునీ గోవిందుడికే అని చెప్పేయండి

రామ రామ అంటూ గోదావ‌రి సుంద‌ర రాముడ్ని త‌ల‌చింది.. తుంగా జ‌లాల సే వ‌కు తుళ‌సీ ద‌ళాల పూజ‌కు వాడినే పుర‌మాయించింది.న‌ల్ల‌ని నీళ్ల సోయ‌గం అక్ష‌రాల‌కు అందించి హాయిగా హంస‌వాహ‌న సేవ‌కు పుర‌మాయించిపోయాడు త‌న పాట‌ను ఆ దుర్గ‌మ్మ చెంత.. వాడు వేటూరి.. తెలుగు జ‌గ‌తికి జాతికి వాడే జాతీయ క‌వి.. పాట భువ‌నం నుంచి గ‌గ‌నం దాక మౌనం గ‌గ‌నం నుంచి గ‌మ్యం దాకా అవును రండి వారిని స్మ‌రిద్దాం…

తెల్ల చీర‌కు త‌క‌థిమిలు నేర్పిన వాడు

మ‌రుమ‌ల్లె వాన‌కు స‌రిగ‌మ‌లు అందించిన వాడు

వాడు వేణువు వాడు వెదురు గాలి పురుడు పోసుకున్న స్వ‌రాయువు

వాడు మ‌న ఇంటి వేటూరి..

ఒక చోట ఓ చెట్టు నీడ పాట రాస్తున్నాడు.నీడ‌ల్లో నీడ‌గా ఉండిపోయిన వా డు..నీడలకు జావ‌ళిని వినిపించి త‌న వెంట న‌డిపించ‌గ‌ల‌వాడు.. ఒక్క‌డు.. రేప‌ల్లెన ఒక్క‌డు మా ప‌ల్లెన ఒక్క‌డు.. కృష్ణా తీరాన ఒక్క‌డు.. సుంద‌ర రాము డు..వేటూరి వారింటి సుంద‌ర రాముడు.ఎందుకీ మోహం ఏమిటీ గానం అని అడ‌గొద్దు ప్లీజ్ ప్లీజ్ … మ‌ళ్లీ అనండిక న‌మామి వేటూరి..స్మరామి వేటూరి……

.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

సంద‌ర్భం : మే – 22 – వేటూరి వర్ధంతి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top