ఇల బొమ్మల కొలువు
కదిలే బొమ్మల కొలువు
ఎదలే అన్నిట కరవు
ప్రయోజనం ఆశించే జనం
ఆమె భక్తగణం
ఆమె పేర వ్యాపారం చేసుకునే
ఫణం ఆత్మ సమర్పణం
ఘన చీరల అమ్మకాలు
చందనాల చర్చలు
కన్నుమిన్ను గానకుండ
కాంతామణి ఖర్చులు
ప్రతివీధీ ప్రతిసందున
అమ్మవారి విగ్రహాలు
వరాలడుగుతూ తిరిగే
నర మానవుల గ్రహాలు
దసరా మామూళ్ళిస్తే
శాంతించే ఆగ్రహాలు
ఆస్తికత్వమెక్కడుంది
ఆస్తీ తత్వం తప్ప..
అస్థికా పంజరాల
ఆశామోహం తప్ప
కలం పట్టి రాస్తుంటే
రసదాగా ఉంటుంది
కాలక్షేపానికి బలే
సరదాగా ఉంటుంది
అవసరాలు ఎన్నున్నా
ఆసరాలు ఉన్నవారి
వసారాలలో మాత్రం
దసరాగా ఉంటుంది
అమ్మా! తల్లీ..దుర్గా..!!
ఇదినా దసరా సర్గ..!!
(వేటూరి గారు వెలుగు మేగజైన్ కి ‘2006 దసరాలో’ రాసిన పద్యం ఇది)
వేటూరి రవిప్రకాష్ గారికి ధన్యవాదాలతో టీం వేటూరి.ఇన్
చిత్రకారుడికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం