అవిఘ్నమస్తు – (డా.వేటూరి సుందరరామ మూర్తి)

విఘ్ననాయకుడి గురించి వేటూరి గారు (సెప్టెంబర్ 2007 లో) వ్రాసిన పాట

పల్లవి:

గణపతి భక్త జన గణపతి

ఆర్షభారత మహాజన గణపతి

పదములో శృతి నీవు

పద్యమున యతి నీవు

నా పంచ ప్రాణాల గతినీవు

ఆరంభ గణపతి హేరంభ గణపతి

చరణం:

నీ భూమియే వేరు నీ భూమికే వేరు

తల్లితండ్రుల కన్న ధరణియే లేదు

నీ వేగమే వేరు నీ యోగమే వేరు

నీ మనోవేగమే నీకు చేవ్రాలు

ధన్యజీవులు కదా పార్వతీ శివులు

పుత్రునిగ నిను గన్న పుణ్యదంపతులు

చరణం:

నవ్యవేదము వెలిసె నీ అక్షరాలా

భవ్య భగవద్గీత నీచేతిరాత

నీదు కరుణే చాలు మాకార్యమీడేరు

చదువులు సంపదలు మాఇళ్ళకే చేరు

సారధివి సచివుడవు సన్నిహిత బంధుడవు

సన్నిత్రుడవు నీవె సాక్షిగణనాధ


వేటూరి రవిప్రకాష్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top