వేటూరి సినిమాల్లోకి రాకపూర్వం నెల్లూరు లోని కొంతమంది ఔత్సాహిక కళాకారులు “దేవదాసు” ని రంగస్థల నాటకంగా ప్రదర్శిస్తూ వేటూరి గారిని అందుకోసం పాటలు రాయమని అడిగారు.కుమార్ అనే హార్మోనిస్ట్ ఈ పాటలకి సంగీతం సమకూర్చారు. అందులో ఒక పాట ఇది (దేవదాసు సినిమాలోని సముద్రాల-మల్లాది వారి సాహిత్యంతో పోల్చి చూసుకోవచ్చు)
“అంతా సుఖమేనోయ్ బ్రతుకే
వింత అనుభవమోయ్
ఆరిపోయిన ఆశలలోన
ఆరు ఋతువులు ఒకటేనోయ్
కల నిజమా నిజము నిజమా
కలా నిజమూ కలేనా
వస గొంతున కోయిలా
కొసరి కొసరి కూయకే
వసంతమే వచ్చిందనీ వలపులు కలబోయకే
మూడు నాళ్ళ ముచ్చట ఇది
మోడులు నవ్వే పండగ
ఎగసి పాడకే గుండెలు
రగిలే వేసవులుండగ”
అదీ వేటూరి వారి కలం పదును
దేవదాసు సినిమా లో పాట ఇక్కడ చూడండి
హాసం, కౌముది పత్రికల వారి సౌజన్యంతో, వారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్
I could not play the video as it is private. Please give the opportunity to watch.
Thanks
Jayaram Vutukuri
జయరాం గారూ ఆ విడియో పాత దేవదాస్ సినిమాలో “జగమే మాయ బ్రతుకే మాయ” పాటేనండీ, యూట్యూబ్ లో దొరుకుతుంది చూడండి