మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల,తారాడే హాయి లో…

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

పలికే పెదవి వణికింది ఎందుకో

వణికే పెదవీ వెనకాల ఏమిటో

కలిసే మనసులా ..విరిసే వయసులా

కలిసే మనసులా ..విరిసే వయసులా

నీలి నీలి ఊసులు…లేత గాలి బాసలు

ఏమేమో అడిగినా…||మౌనమేలనోయి ||

 

హిమమే కురిసే చందమామ కౌగిటా

సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా

ఇవి ఏడడుగులా…వలపూ మడుగులా

ఇవి ఏడడుగులా…వలపూ మడుగులా

కన్నె ఈడు ఉలుకులు …చంటి పాప కబురులూ

ఎంతెంతో తెలిసినా …

 

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల …తారాడే హాయి లో

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి…

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.