“శ్రీనారద సరసీరుహ భృంగ గళోత్తుంగ మహా
మధుగంగా భగీరధుడు మా ఎస్పీబాలు
ప్రాణాయామం లోతున పండిన పండితుడీతడు
షష్టిదాటినా సరే ‘బాలుడిగా చలామణీ
ఘంటసాల గాంధర్వపు వంశానికి శిరోమణి
తనువంతా హృదయమున్న అతనికెవరు సాటి
స్వర సంపదలో అతనికి లేరు కదా పోటీ
వెయ్యి పూర్ణ చంద్రుల్ని చూడాలీ బాలు”
ఈ ఆశీరక్షతలే ప్రియమిత్రుడు వాలు
(“సరిగమలకు డుమువులు ఆశీస్సులు” శీర్షికన ఎస్పీబాలు షష్టిపూర్తికి ‘వెలుగు’ ప్రత్యేక సంచికలో వేటూరి అశంస)