వేటూరి రాసిన “జీవనరాగం” నవల 1959 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో సీరియల్ గా ప్రచురితమయింది.తర్వాత 1970 లో పుస్తక రూపాన్ని దాల్చింది.అందులో సాలూరి రాజేశ్వర రావు గారి ప్రతిభను మెచ్చుతూ వేటూరి రాసిన ఒక కవిత ఉంది.
గొంతు నీది కానీ అది
కోయిలలకు విడిది
పాట నీది కానీ అది
పలికిన హృదయం నాది
కొండలు నీ పాటలు విని
గుండెల వలె స్పందించును
గుండెలలో నీ పదాలు
నిండి మధువు చిందించును
లాహిరిలో శరద్వేణు
మోహనమే పలికించును
గోపీలోలుని కన్నుల
గోపరాగముల నించును
విమలమైన గాంధర్వము
విద్య నీకు విందు మాకు
ఇంటి పేరు సాలూరు-నీ
యింటి పేర రసాలూరు!
నాదనదీస్నవిత హృదయ
వేదికపై నవ ఉషస్సు
రాగము ఒక యోగమైన
యోగివి నీకిదె నమస్సు.
వేటూరి సుందరరామమూర్తి
—————————————————-
ఈ “జీవనరాగం” నవల పరిచయం తృష్ణ గారి బ్లాగ్ లో ఈ కింద లింక్ లో చూడచ్చు
http://trishnaventa.blogspot.in/2013/05/blog-post_22.html
ఇట్లు వేటూరి.ఇన్ టీం
sir please inform if the books published
I eagerly waiting