చల్లగాలిలో (పాటలు)
పల్లవి:
నాటిగీతాల పారిజాతాల మౌనసంగీతమో
వేయి ప్రాణాల వేణుగానాల గీతగోవిందమో
అది తెలుగింటి కోవెలా మధువొలికేటి కోయిలా
అది పున్నాగపూల సన్నాయి బాల పూసంత వెన్నెల
మన సాలూరివారి యమునావిహారి రాగాల ఊయల
చరణం 1
మల్లీశ్వరికి మేఘమాలకు నువ్వు నేర్పినా భీమ్ ప్లాసులు
మల్లీశ్వరికి మేఘమాలకు నువ్వు నేర్పిన ప్రేమా ఊసులు
వెన్నెలపాళితో వెండితెరపై నువ్వురాసిన చంద్రలేఖలు
దేవులపల్లికి కోవెల కట్టిన సర్వస్వరాల చమకాలు
భావకుసుమాల పరిమళాలతో బంతులాడిన గమకాలు
మీ బృందావని మా అందరిదీ
మా రాజేశ్వరుడందరివాడేలే
చరణం 2
సంగీతానికి సాహిత్యానికి ఎల్లలు చెరిపిన గాంధర్వం
జాజిపూలతో జావళికట్టే జాణకదా నీ హార్మోనీయం
ఏవీ-ఏవీ ఆ పంచదార చిలకలు
ఎక్కడ-ఎక్కడ ఆ మోహనాల మొలకలు
ఎప్పుడు మాష్టారూ మళ్ళీ ఆ స్వరయుగం
ఉందాలేదా ఈ జన్మకా యోగం
(సాలూరి వారి చిత్రం గీసిన పొన్నాడ మూర్తి గారికి, వేటూరి రవిప్రకాష్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం)
Dear Friends,
you can listen to the song, CHALLAGALILO, Music BY Sri Singeetham Srinivasa Rao garu and Written by Sri Veturi and Sung by Sri S P B,
here,
https://www.youtube.com/watch?v=1ans2QbWTPo
regards, Ravi
Dear Friends,
you can also see the audio release function through this video link,
https://www.youtube.com/watch?v=jOFIcHrEPww
Ravi
Kindly add the feature of notifying readers about posts on your site through E-mail subscription.