జయంతి చక్రవర్తి గారి పుస్తకం “వేటూరి నవరస గీతాలు”
వేటూరి సుందరరామమూర్తి గేయరచయితగా ఒక హిమాలయం..ఆయన ముఫైఆరేళ్ల సినీ జీవితంలో రాసిన వేలాది పాటలు ఒక పరిశోధనాంశం. ఆ పాటల్ని ఎన్నివిధాల విభజించాలో..తరచి చూడాలో..ఎలా పరిశీలించాలో అన్న అంశంతోనే ఓ పుస్తకం తయారవుతుంది. అందుకే “జయంతి చక్రవర్తి” గారు వేటూరి పాటలపై, జీవితంపై సునిశిత పరిశీలన జరిపారు. తన సమగ్ర పరిశోధన అంతా పుస్తకంగా తెచ్చారు. ఆ పుస్తకం పేరు వేటూరి నవరస గీతాలు. చాలా సమగ్రంగా వుంటుందీ పుస్తకం. వేటూరి పాటల కోసం అయితే ఈ పుస్తకం చూడక్కరలేదు. కానీ పాటల విలువల గురించి, ప్రత్యేకతల గురించి మాత్రం తెలుసుకోవడానికి ఓసారి ఈ పుస్తకం తిరగేయాలి. వేటూరి శైలికి ఆ పరిశోధనా గ్రంధకర్త వేటూరిజం అని పేరు పెట్టారు. అది కచ్చితంగా సబబే. వేటూరి శైలి అనితరసాధ్యం. ముదిమి మీదపడిన తరువాత కూడా..ఆ..అంటే అమలాపురం అని రాసి కుర్రకారును ఊపేసిన ఘనుడాయన. పాటల కుస్తీలో ఎటువంటి విభాగంలోనైనా సై అనగల మొనగాడు ఆయన. ఆయనపై అంతకు అంతా పరిశోధన చేసి పుస్తకం తేవడం విశేషమే.
Read the Book here / Download the pdf
వారి పుస్తకాన్ని అభిమానులకి అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సైట్ లో ఉంచడానికి అనుమతిచ్చిన చక్రవర్తి గారికి ధన్యవాదాలతో
nenu veturi veeraabhimaanini.cinimaa paatallo kavitvam ledanna vaarini chuuste jaali kalugutundi.yelaanti paatanaina raasi meppinchagala gadasari redu veturi.antalaa telugu bhashato aadukunnavaadu inkokaru leru.
thanks for sharing this.. this is a Golden treasure for us
cheers
chandi
Thank you very much for sharing this book.
ధన్యవాదములు పుస్తకము అందించినందుకు..
How to buy this book
అద్భుత ప్రయత్నం. సహకరించిన చక్రవర్తి గారికి ధన్యవాదాలు. ఇలాంటి పుస్తకాలు ఇంకా యెన్నో రావాలి.