mass పాటల్లో వేటూరిని మనం తిట్టుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే శ్రుతిమించిన ప్రయోగాలు, అర్థం పర్థం లేని పద-గారడీలు చాలానే చేశారు కనుక. అయితే చెత్త పాటల్లో కూడా అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని మెచ్చదగిన ప్రయోగాలు చేసినప్పుడు మాత్రం మెచ్చుకోవాలి. “భలే దొంగలు” అనే ఒక కొత్త సినిమాలోని ఒక mass song పల్లవి చూడండి –
పంచదార ఎడారిలో పడుచు గుర్రం సవారిలో
variety గా ఉంది. “పంచదార ఎడారి” లాటి ప్రయోగాలు వేటూరే చెయ్యగలరు అనిపిస్తుంది.
మిగతా పాటలో పెద్ద విషయం లేదు…ట్యూన్ mass గా ఇస్తూనే చరణం మధ్యలో కాస్త classical touch ఉన్న bit వాడిన K.M. Radha Krishnan (music director) మార్కులు కొట్టేస్తాడు. వేటూరి కూడా ఆ bit కి భావ ప్రధానమైన lyric రాసి మురిపించారు –
తాకే తనువులలో తగిలే సొగసెంత?
సోకే వలపులలో రగిలే వయసంత!
….
అందే పెదవులలో చిందే మధువెంత?
పొందే ముడుపులకి ఉంది తగినంత !!
అలాగే కంత్రీ లో “వయస్సునామీ తాకెనమ్మీ” పల్లవి గల పాట.
ఇక్కడ “వయస్సునామీ” అన్న పద ప్రయోగం ముద్దుగా ఉంది, Tune కి ఎంతో perfect గా సరిపోయి, అందాన్ని తెచ్చింది. మిగతా పాటలో చెప్పుకునేందుకు పెద్ద ఏమీ లేదు…routine mass song…కొంత శ్రుతి మించింది ఏమో కూడా
🙂 After a long time. I thought you stopped updating this blog.
మళ్లీ చాన్నాళ్లకు మీ దర్శనం జరిగింది! ఈ వయస్సునామీ పాట నిన్న రాత్రే వింటూ, ఇలాంటి పదమొక్కటి తయారుచేసి దాన్ని ముందునిలబెట్టి పాట భలేగా కట్టేశాడు వేటూరి అనుకున్నాను! భలేదొంగలు పాట వినలేదు. మీరు చూపించారుగా, ఇక వినాలి.
‘ఇదీ సంగతి’ అనే సినిమా పాటలు కూడా విన్నాను నాలుగింటిలో మూడు బాగున్నాయి. సిరివెన్నెల, వేటూరి మాత్రమేగాక, కొత్త కవుల పాటల్లో కూడా చెప్పుకోదగ్గ విశేషాలు కనిపిస్తే రాస్తూవుండండి – కాస్త తరచుగా.
“కుర్ర నా ఈడు గుర్రమై తన్నె గుట్టుగా గుండెలదరగ” గుర్తొచ్చింది.
Good observation.Aaa paatalu vinetappudu,inni prayogaalani,normal ga 90% mandi observe cheyaru,Vaatini visadeekarinchi cheppinanduku(Manchivaina,…Pichivainaa) meeku chaala Thanks.
అశ్వమేధంలో అనుకుంటా ఒకపాట…
ఎడారిలో కోయిలమ్మ.. కచేరి నా ప్రేమగా..
ఎదారిన దారిలోన షికారులే నావిగా..
వేటూరి మార్కు పన్నులంటే నాకు భలే ఇష్టం