“రెండు రెళ్ళ ఆరు” సినిమాలో “కాస్తందుకో దరఖాస్తందుకో” పాట లో రెండో చరణం –
ఆమె: చలి గాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే, చెలి చెంత చేరునా చెలిమల్లే మారునా
అతను: నెలవంక దరఖాస్తు లేకుంటె చెక్కిళ్ళు, ఎరుపెక్కి పోవునా, ఎన్నెల్లు పంచునా
ఆమె: దరిచేరుతున్నా దరఖాస్తులేల?
పాటలో ఈ lines నచ్చుతాయి నాకు. ముఖ్యంగా చందమామతో నిండిన వెన్నెల రాత్రి లేక పోతే ప్రియురాలి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి (ఆ వెన్నెల రాత్రిలో కలిగే ప్రణయ భావాల వల్ల), ప్రియుడికి ఆనందం కలిగించే chance ఉండదు కదా? అని రాయడం ఎంత చిలిపితనం!
ఇది నాకు వచ్చ్హిన thought:
పాట రెండో లైను లొ నెలవంక దరఖస్తు అంటే ముద్దు అని అర్థం లొ వాడొచ్చు కూడా.పలువరసని నెలవంక ల తీసుకొని వాటి గాయలవల్ల(ముద్దు)బుగ్గలు ఎరుపెక్కాయని చెప్పవచ్చు vennellu panchena ante aa muddu ki navvulu panchena preyasi అని ఇంకొంచం romantic ga cheppavachhu kada? asalu writer alochana entooo mari….:)