వేటూరి గారి గురించి కొన్ని ‘సం’గీతపు ముచ్చట్లు
నాగాధ వినర గాధేయ..(గాధేయుడు అంటే గాధి కొడుకు,విశ్వామిత్రుడు.ఖైదీ సినిమాలో)కలలను పెంచకు కలతలు దాచకు ఏ’మైనా”..ఓ”మైనా”(సితార)..”మారేడు” నీవని ఏరేరి తేనా “మారేడు”దళములు నీపూజకు(భక్తకన్నప్ప)…వరములు చిలక..స్వరములు చిలక..కరమున చిలక కలదాన…హిమగిరి చిలక..శివగిరి చిలక..మమతలు చిలక దిగిరావా(అర్జున్).ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ..వీటిలో పదాల శబ్ధాలు ఒకటేగా అనిపించినా అర్ధాలు వేరు.ఇలాంటి అక్షరమాయలు చేసినా..గగనజఘనసొగసులలరవే అని హ్రస్వాక్షరాలతో అతివల అందాలని వర్ణించినా..ప్రాసలు,అలంకారాలు,చంధస్సులతో తెలుగు వారిని మైమరపించిన… పదాలకూర్పులో విలక్షణం..వినేవారికి సులక్షణం అనిపించిన ..వేలకి వేల పాటలు అలవోకగా రాసిన.. డబ్బు కంటే ఎక్కువగా ఆ సరస్వతీదేవి కరుణా కటాక్షాలను,సాహితీ సంగీతాభిమానులనే ఎక్కువగా సంపాదించుకుని,తన పాటలతో తెలుగువారిని ఉర్రూతలూగించిన శ్రేష్ఠమైన సాహితీ స్రష్ట… తెలుగు పాట కి ఒక జాతీయ అవార్డు సాధించి పెట్టిన ద్వితీయుడు(శ్రీశ్రీ తర్వాత), అన్ని రకాల పాటలు రాయడంలో అద్వితీయుడు… భావి రచయితలకి స్పూర్తి…శేషకీర్తి…శ్రీ వేటూరి సుందరరామమూర్తి.
అయన రాసినదే మరొక అధ్భుతమైన పాట ఇది…ఈ పాటలో కూడ అక్షర విన్యాసాలు చాలానే ఉన్నాయి.. జానకి గారు కూడా చాలా అద్భుతం గా పాడారు..చదివి,విని ఆనందిస్తారని ఆశిస్తూ..
చిత్రం:ఓ భార్య కథ(1988)
గానం:జానకి
సాహిత్యం:వేటూరి
సంగీతం:యస్.పి.బాలు.
మనసులకి లాలిపాట..మన కధల జాలిపాట
రెప్పలేని కంటిపాపకి నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట
మనసులకి లాలిపాట..మన కధల జాలిపాట
రెప్పలేని కంటిపాపకి నాపాపకి దూరాన ఉన్నతల్లి గారాల జోలపాట
మనసులకి లాలిపాట..మన కధల జాలిపాట
ఏదేవుడీ చేరాతలో నాపాప గా నిన్ను చేసే
నా దేవుడే చేజేతులా ఈ అమ్మనీ బొమ్మ చేసే
నీ దిక్కుగా నేనుండగా నా దివ్వె నీలోన మెరిసే
కన్నీటిలో కమలాలకై ఏ తుమ్మెదో వేచి చూసే
నా గీత ఓ గీతమై నా కంటి జలపాతమై
నీ తల్లిగా జోల నే పాడనా నీడోల నేనూపనా
మనసులకి లాలిపాట..మన కధల జాలిపాట
జోజో లాలి జో హాయి జోజో లాలి జో
ఏ జన్మకీ స్త్రీ జన్మమే నీకొద్దు నా చిట్టి తల్లి
ఏకాకిలా ఓ కాకి లా మారింది ఈ కన్నతల్లి
ఈ కోవెలా..నాకో వెలా తెచ్చింది ఈనాడు తల్లి
నావెన్నెలే ఆవేదనై పొంగింది నా కంట మళ్ళీ
వాల్మీకి వారించినా..వగచింది ఆ జానకి
నీ జోల కావాలి ఈ అమ్మకి..నాతల్లి గా జన్మకి
మనసులకి లాలిపాట..మన కధల జాలిపాట
రెప్పలేని కంటి పాపకి నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట
మనసులకి లాలిపాట..మన కధల జాలిపాట
జోజో లాలి జో హాయి జోజో లాలి జో
——————————————————————————————————–
‘ప్రతాప్ కుమార్ రెడ్డి’ గారు వేటూరికి సమర్పించిన ఈ గీతాంజలి వారికే ‘నివాళి‘గా సమర్పిస్తూ,
‘రాధ మండువ గారి’కి ధన్యవాదాలతో ‘వేటూరి.ఇన్‘ టీమ్