సాలూరి రాజేశ్వర రావు – వేటూరి

వేటూరి రాసిన “జీవనరాగం” నవల 1959 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో సీరియల్ గా ప్రచురితమయింది.తర్వాత 1970 లో పుస్తక రూపాన్ని దాల్చింది.అందులో సాలూరి రాజేశ్వర రావు గారి ప్రతిభను మెచ్చుతూ వేటూరి రాసిన ఒక కవిత ఉంది.

S.Rajeswara Raoసాలూరి రాజేశ్వర రావు గారికి

గొంతు నీది కానీ అది

కోయిలలకు విడిది

పాట నీది కానీ అది

పలికిన హృదయం నాది

 

కొండలు నీ పాటలు విని

గుండెల వలె స్పందించును

గుండెలలో నీ పదాలు

నిండి మధువు చిందించును

 

లాహిరిలో శరద్వేణు

మోహనమే పలికించును

గోపీలోలుని కన్నుల

గోపరాగముల నించును

  

విమలమైన గాంధర్వము

విద్య నీకు విందు మాకు

ఇంటి పేరు సాలూరు-నీ

యింటి పేర రసాలూరు!

 

నాదనదీస్నవిత హృదయ

వేదికపై నవ ఉషస్సు

రాగము ఒక యోగమైన

యోగివి నీకిదె నమస్సు.

 

వేటూరి సుందరరామమూర్తి

—————————————————-

Jeevanaram - Cover Page

 

 

ఈ “జీవనరాగం” నవల పరిచయం తృష్ణ గారి బ్లాగ్ లో ఈ కింద లింక్ లో చూడచ్చు

http://trishnaventa.blogspot.in/2013/05/blog-post_22.html

 

ఇట్లు వేటూరి.ఇన్ టీం

 

You May Also Like

One thought on “సాలూరి రాజేశ్వర రావు – వేటూరి

Leave a Reply

Your email address will not be published.