పాటకు చందస్సు మారిపోయింది, మాటకు విలువ పడిపోయింది.

 

సినీ ఫార్ములాలు ఏర్పడ్డ తర్వాత జీవత్ చిత్రాల జోలికి వెళ్ళడం మానేసారు దర్శక నిర్మాతలు. వినోదం ఒక్కటే సినిమాకి పరమావధి  చేసుకున్నారు.జనాకర్షణా తద్వారా ధనార్జనా ప్రధానమైన తర్వాత పాటకు చందస్సు మారిపోయింది, మాటకు విలువ పడిపోయింది. ఆర్ధోక్తిలో, చిరునవ్వులో, నిట్టూర్పులో, కన్నీటిచుక్కలో మౌనమైన మాటకి శక్తి పోయింది. అటువంటి సినిమాలు  (దేవత, త్యాగయ్య, సీతాకోకచిలుక, గీతాంజలి, శంకరాభరణం) తియ్యాలనే ఆసక్తి నిర్మాతల్లో తగ్గిపోయింది.

 

హీరో హీరోయిన్లకీ కమేడియన్లకీ తేడా లేకుండా పోయినప్పట్నించీ కధనంలో మసాలా కోసం డ్యూయట్లు పాడుకోడం ప్రారంభమయింది.సోలో లు కానీ డ్యూయట్లు కానీ ముత్యాలముగ్గు తర్వాత రంగు రుచి వాసనా మారిపోయి పూర్వపు బంగారక్కా కేతిగాడూ పద్ధతికి చేరుకున్నాయి. పాత్రధారుల వేషాలూ,గాత్రధారుల రాగాలూ కూడా మారిపోయాయి.

 

తెలుగులో రాయడానికి తగిన అమరిక ఈనాటి యుగళ గీతాలలో లేదు. సందెగాలి, చందమామ,  మల్లెపూలు,  మంచిగంధం, ఏటివొడ్డు, పడవ ప్రయాణం, గుడి గంటలూ, ఆకుపచ్చ చేలూ, చిలకపచ్చ చీరలూ, కట్టూ బొట్టూ, గుట్టూ మట్టూ లేని శృంగారానికి సరిపోవని తెలుగు భాష ఏనాడో సవినయంగా ఒప్పుకుంది.

 

“సీతారామయ్య గారి మనవరాలు” తరువాత  నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవాల్సిన స్థితిలో పడ్డాను.

 

వేటూరికొమ్మకొమ్మకో సన్నాయినించి

You May Also Like

Leave a Reply

Your email address will not be published.