మా గురించి

మేమూ “వేటూరి” అభిమానులం మీలాగే…

“యద్భావం తద్భవతి” అన్నారు పెద్దలు.అలాగే వేటూరి రచనల్ని ఎవరు ఏవిధంగా అన్వయించుకుంటే ఆ విధంగా అనిపిస్తాయి, కానీ, తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళకి లోతైన విషయాలెన్నో కనిపిస్తాయి ఆ రచనల్లో.

ఆయన కలానికి రెండువైపులా పదునే. ఆయన పలికించని రసం లేదు, స్పృశించని అంశం లేదు, అదొక మహా సముద్రం.ఎంత ఈదినా అంతూ దరీ దొరకదు.

ఎన్నో భావ రస స్పోరకమైన పాటల్ని మనకి అందించిన ఆ నవ కవితా వనమాలి, తాను సృజించిన పాటల పూదోటలో మనల్ని విహరించమనీ, ఆ సువాసనలని ఆఘ్రాణించమనీ, ఆటలాడుకోమనీ, జోల పాటలు పాడుకోమనీ చెప్పి, తను మాత్రం అమృతతుల్యమయిపోయారు.

అటువంటి మహానుభావుడి వ్రాతల్ని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంచడానికి “చంద్రుడికో నూలుపోగు” చందాన ఆయన అభిమానులుగా మేము చేసే చిన్న ప్రయత్నమే ఇది.

 

 

 

 

* * *

అవినేని భాస్కర్
కె.ఎస్.ఎం.ఫణీంద్ర
పి.సందీప్
పప్పు శ్రీనివాసరావు

15 thoughts on “మా గురించి

 1. ఆహా! ఎంత చక్కని ప్రయత్నం.నిజంగా ఇది సాహిత్యప్రియులు ఆనందించదగ్గ విషయం. ఇంత చక్కని ప్రయత్నం మరింత మంది అభిమానుల చెంతకు వెళ్ళాలనేది నా అభిప్రాయం. అందుకోసం నావంతుగా మా వెబ్-సైట్ (www.tollywoodtv.com) లో వేటూరిగారి సైట్ ప్రచారంకోసం కొంత స్థలం హోమ్ పేజ్ లో ఇవ్వదలిచాను. ఇందుకు నేను ఏరకంగా మీకు సహాయ పడగలనో తెలుపగలరు.

 2. బాలూ గారూ మీ అభిమానానికి వేటూరి.ఇన్ కృతజ్ఞతలు తెలియచేస్తోంది. ప్రస్తుతానికి మీ సైట్ లొ మా వేటూరి లింక్ ప్రదర్శించండి.

 3. Nenu kooda ee adbuthamaina website lo Veturi gari paatala gurinchi raadhamanukuntunnanu..adhi veelu paduthundho ledho naaku tappaka cheppandi..

 4. మీకు వ్రాయాలన్న అబిలాషా,అభిరుచి ఉంటే వ్రాసి పంపండి తప్పకుండా ప్రచురిస్తాం నవ్య గారూ.

 5. VETURI GARU DABBING SONGS KU ANTAGAA NYAYAM CHEYALEDU ANI MEE WEBSITE LO CHADIVANU…

  EVARU EVARU CHEPPARANDI…….. AAYANA THAPA ENKOKARU DABBING SONGS KU NYAYAM CHEYAGALARA?

  OPEN CHALLENGE CHESTUNNANU……

  FOR EXAMPLE…..

  IDDARU MOVIE LO SASIVADANE SONG, SITHAKOKA CHILUKA LO SONGS, AMRUTHA LO SONGS,

  BOMBAY LO SONGS…….. OKKATA RENDA… … SAKHI LO SONGS……

  EVARU CHEPPARANDI….. AYANA LEKAPOTHE SONGS ELAVUNTAYANTE..

  EE MADYA KOMARAM PULI MOVIE SONGS VINNARA.. EMAINA ARDAMAINDA?

 6. వేటూరి గారు 1996 ఆంధ్రప్రభ లో కొన్ని వ్యాసాలు రాసారని ఎక్కడో చదివాను.
  ఎవరైనా ఈ వ్యాసాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలిగితే చాలా సంతోషం.
  1. అభ్యుదయ కవిగా అన్నమయ్య
  2. గాంధీమహాత్ముడు బయలుదేరగా..
  3. ప్రాదెశిక సుగమ సంగీతం
  4. అనురాగమాలిక
  5. అభినవదత్తుడు అమృతకల్పుడు శ్రీ గణపతి సచ్చిదానంద

 7. Sir,

  Veturi is a great blessing to our Telugu cinema field. I never ever see a cinema poet like him…his diction..thought evolving…word power…experimentation… not possible to anybody…he is such a giant…!!!

 8. మూర్తి గారూ మీ వ్యాఖ్య కొంచం ఎడిట్ చేసాను,తప్పుగా అనుకోకండి.ఇది వేటూరి గారి గురించిన సైట్ మాత్రమే,అలాగని ఇతరులని విమర్శించాలని కాదు కదా.ఎవరి గొప్పతనం వారిది.

 9. సీతారామ రాజు గారూ,

  ఆంధ్రప్రభ వారికి మెయిల్ చేసానండీ,వివరం తెలియగానె ఈ సైట్ లో వారి అనుమతితో ప్రచురిస్తాను.సమాచారానికి ధన్యవాదాలు.

 10. Where can we get “కొమ్మ కొమ్మకో సన్నాయీ” book? do we have any online link for read/purchase?

 11. నాగేష్ గారూ ఈ పుస్తకం ఆన్‌లైన్లో దొరకదండీ, విశాలాంధ్ర లో ప్రయత్నించండి

  1. మీకు వ్రాయాలన్న అబిలాషా,అభిరుచి ఉంటే వ్రాసి పంపండి తప్పకుండా ప్రచురిస్తాం గోవిందరాజులు గారూ.వేటూరి గారికి సంబంధించిన రచనలు మీద వ్యాసాలు,సమీక్షలు, (మీకు తెలిసిన, ఇంతకుమునుపు ఈ సైట్ లో ప్రచురించనివి) సంగ్రహణలు ఏమైనా సరే పంపించండి

Leave a Reply

Your email address will not be published.